iDreamPost

అనిల్ సుంకరను వదలని కష్టాలు! ‘భోళా​’ ప్రొడ్యూసర్​పై డిస్ట్రిబ్యూటర్ కేసు?

  • Author singhj Published - 03:21 PM, Tue - 8 August 23
  • Author singhj Published - 03:21 PM, Tue - 8 August 23
అనిల్ సుంకరను వదలని కష్టాలు! ‘భోళా​’ ప్రొడ్యూసర్​పై డిస్ట్రిబ్యూటర్ కేసు?

సినీ పరిశ్రమలో నిర్మాత లేనిదే ఏదీ లేదు. ఒక ప్రొజెక్ట్ కార్యరూపం దాల్చాలంటే ప్రొడ్యూసర్ ఉండాల్సిందే. కథను, హీరోను, డైరెక్టర్​ను నమ్మి డబ్బులు పెట్టే నిర్మాతకు ఎంత లాభాలు వస్తే అన్ని ఎక్కువ చిత్రాలు తీస్తాడు. అయితే ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్​గా రాణించడం అంత ఈజీ కాదు. సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉండే చిత్ర పరిశ్రమలో రాణించాలంటే సినిమాలపై మక్కువతో పాటు లాభ, నష్టాలను బేరీజు వేసుకుంటూ పక్కా ప్లానింగ్​తో ముందుకెళ్లాలి. అప్పుడే ఫ్లాప్​లు వచ్చినా తట్టుకొని ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నెగ్గుకురావొచ్చు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్లలో అనిల్ సుంకర ఒకరు. 14 రీల్స్ ఎంటర్​టైన్​మెంట్​ ఆయన ఆధ్వర్యంలోనే నిర్మించబడింది. ‘బిందాస్’, ‘నమో వెంకటేశ’, ‘దూకుడు’, ‘లెజెండ్’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’, ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి హిట్స్​తో ప్రొడ్యూసర్​గా మంచి పేరు తెచ్చుకున్నారాయన. అయితే 2021 నుంచి అనిల్ సుంకరకు ఏదీ కలసి రావడం లేదు. సిద్ధార్థ్, శర్వానంద్​లతో తీసిన మల్టీస్టారర్ ‘మహాసముద్రం’ డిజాస్టర్​గా నిలిచింది. ఎన్నో ఆశలతో, భారీ బడ్జెట్​తో రూపొందిన ‘ఏజెంట్’ అయితే ఆయన్ను నిండా ముంచింది.

‘ఏజెంట్’తో తీవ్రంగా దెబ్బతిన్న అనిల్ సుంకరకు ఇటీవల విడుదలైన ‘సామజవరగమన’ రూపంలో మంచి హిట్ పడింది. ఈ సినిమాకు మంచి ప్రాఫిట్స్ రావడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేసిన ‘భోళా శంకర్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఏజెంట్’తో దెబ్బతిన్న అనిల్ సుంకర కష్టాలను ‘భోళా శంకర్’ తీర్చేస్తాడని అంతా అనుకుంటున్నారు. అఖిల్ మూవీతో రూ.కోట్లు నష్టపోయిన ఆయన ఈ మూవీతో సెట్ అవుతారని భావిస్తున్నారు.

‘ఏజెంట్’ సినిమా వల్ల అనిల్ సుంకరతో పాటు మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టపోయారట. దీంతో వాళ్లకు ఆయన తిరిగి ఇవ్వాల్సింది కూడా ఉందట. ఈ నేపథ్యంలో అనిల్ సుంకర మీద ఒక డిస్ట్రిబ్యూటర్ కేసు వేశారనే వార్త హాట్​ టాపిక్​గా మారింది. ఓ డిస్ట్రిబ్యూటర్ ‘ఏజెంట్’ ఏపీ, కర్ణాటక రైట్స్​ను కలిపి రూ.30 కోట్లకు కొన్నాడట. కానీ ఈ మూవీకి కనీసం రూ.2 కోట్లు కూడా రికవరీ కాలేదట. కానీ ఇప్పుడేమో తనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా ‘భోళా శంకర్’ హక్కులను వేరేవాళ్లకు అనిల్ సుంకర అమ్మేశారంటూ ఆ డిస్ట్రిబ్యూటర్ కేసు వేశాడని వార్తలు వస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి