iDreamPost

Bhatti Vikramarka: శుభవార్త.. ఆ నెల నుంచి కరెంట్‌ బిల్లులు కట్టాల్సిన పని లేదు: భట్టి

  • Published Feb 26, 2024 | 8:03 AMUpdated Feb 26, 2024 | 8:10 AM

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రటకన చేశారు. వారంతా ఆ నెల నుంచి కరెంట్‌ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆవివరాలు..

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రటకన చేశారు. వారంతా ఆ నెల నుంచి కరెంట్‌ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆవివరాలు..

  • Published Feb 26, 2024 | 8:03 AMUpdated Feb 26, 2024 | 8:10 AM
Bhatti Vikramarka: శుభవార్త.. ఆ నెల నుంచి  కరెంట్‌ బిల్లులు కట్టాల్సిన పని లేదు: భట్టి

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు వడివడిగా ముందడుగులు వేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం చేసింది. ఇక మార్చి నాటికి మిగతా గ్యారెంటీలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నెలాఖరు లేక మార్చి మొదటి వారంలోగా 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత విద్యుత్‌ పథకాలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు శుభవార్త చెప్పారు. కరెంట్‌ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఆ వివరాలు..

తాజాగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మార్చి నెల నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులు కరెంట్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీలను కూడా తీసుకురానున్నట్టు ప్రకటించారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మార్చి నెల నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వాడుకునే వారు ఎవరూ కరెంట్‌ బిల్లులు చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేశారు.

గత పదేళ్లుగా రాష్ట్రానికి ఎలాంటి విద్యుత్‌ పాలసీ లేదని దీని వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని బొగ్గు గనులన్నీ సింగరేణికే చెందాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా వివరించారు. 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయితే.. గత పదేళ్లుగా కనీస వేతన చట్టం లేక లక్షలాది మంది కార్మికులు నష్టపోయారని భట్టి విక్రమార్క వివరించారు.

ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేస్తుండగా.. ఫిబ్రవరి 27న చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభలో మరో రెండు పథకాలు అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అలానే డ్వాక్రా సంఘాలకు త్వరలోనే వడ్డీ లేని రుణాలు కూడా అందించనున్నట్టు ప్రకటించారు. ఫిబ్రవరి 26 సాయంత్రం 43 వేల మంది సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా పథకాన్ని సైతం ప్రారంభించనున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక బీఆర్‌ఎస్‌ 10 ఏళ్ల పాలనలో సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని భట్టి ఆరోపించారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉద్యోగం కల్పించడమే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యం లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన మరోసారి స్పష్టం చేశారు. చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి