iDreamPost

మహిళలకు శుభవార్త.. ఆ రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!

మహిళలకు శుభవార్త.. ఆ రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!

ఆర్టీసీ అనేది సామాన్యుల వాహనం అనేది చాలా మంది  అభిప్రాయం. కారణం ఈ ఆర్టీసీ సంస్థ.. నిత్యం ఎంతో మంది సామాన్యులను వారి గమ్య స్థానాలకు చేరుస్తుంది. ముఖ్యంగా మహిళ భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు దూర ప్రయాణాలు చేసే వారికి టికెట్‌పై డిస్కౌంట్, ఇతర ఆఫర్లు ప్రకటించింది. అలానే తరచూ ఏదో ఒక శుభవార్త ఆర్టీసీ ప్రయాణికులకు సంస్థ అందిస్తుంది. అలానే మరోసారి టీఎస్‌ఆర్టీసీ.. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఉండే మహిళా ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది.

ఇక ఐటీ సంస్థల్లో, ఆ ప్రాంతాల్లో పని చేసే వారికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. సరిగ్గా ఐటీ మహిళ ఉద్యోగుల విధుల వేళలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ లేడీస్ స్పెషల్ బస్సు ‘జేఎన్టీయూ-వేవ్ రాక్’ మార్గంలో ఉదయం, సాయంత్రం వేళల్లో నడుస్తుంది. ఈ నెల 31 నుంచి అందుబాటులోకి వస్తుంది. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బస్సు జేఎన్టీయూ నుంచి వేవ్‌రాక్ వరకు.. ఫోరమ్ మాల్, నెక్సస్‌ మాల్, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, రాయదుర్గ్, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఎక్స్‌ రోడ్డు, ఇంద్రానగర్, ట్రిపుల్ ఐటీ క్రాస్‌ రోడ్డు, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్‌ మార్గాల్లో ప్రయాణిస్తుంది.

ఐటీ కారిడార్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న మహిళలు ఈ ప్రత్యేక బస్సునలు వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ సంస్థ తెలిపింది. అయితే టీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళ ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో క్యాబ్స్, ఓలా , ర్యాపిడో వెహికల్స్ పై ఆధార పడాల్సిన  అవసరం లేదంటున్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి, ఎండీ సజ్జనార్ గారికి ఐటీ కారిడార్ లో ఉద్యోగం చేస్తున్న మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరి.. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి: రైతులకు శుభవార్త.. అకౌంట్లలో డబ్బు జమ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి