iDreamPost

OMG: 108MP కెమెరాతో 10 వేల బడ్జెట్‌లో అదిరిపోయే స్మార్ట్ ఫోన్

Budget Smart Phone: బడ్జెట్ లో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ కొనాలని భవిస్తున్నారా? అయితే ఈ సూపర్ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ కోసమే. ఏకంగా 108 మెగా పిక్సెల్ కెమెరాతో.. అదిరిపోయే రిజల్యూషన్ తో ఈ ఫోన్ వస్తుంది. ధర కూడా 10 వేల బడ్జెట్ లో ఉండడం విశేషం.

Budget Smart Phone: బడ్జెట్ లో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ కొనాలని భవిస్తున్నారా? అయితే ఈ సూపర్ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ కోసమే. ఏకంగా 108 మెగా పిక్సెల్ కెమెరాతో.. అదిరిపోయే రిజల్యూషన్ తో ఈ ఫోన్ వస్తుంది. ధర కూడా 10 వేల బడ్జెట్ లో ఉండడం విశేషం.

OMG: 108MP కెమెరాతో 10 వేల బడ్జెట్‌లో అదిరిపోయే స్మార్ట్ ఫోన్

స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారి మొదటగా చూసేది బడ్జెట్, ఆ తర్వాత కెమెరా క్వాలిటీ, ఆ తర్వాత బ్యాటరీ బ్యాకప్. మంచి బడ్జెట్ లో అద్భుతమైన కెమెరా క్వాలిటీతో సూపర్ బ్యాటరీ బ్యాకప్ తో మంచి స్మార్ట్ ఫోన్ వస్తుందంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. ఇప్పుడు పోకో కంపెనీ యువత కోసం అత్యంత అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. పోకో ఎం6 పేరుతో అదిరిపోయే ఫీచర్స్ తో ఒక స్మార్ట్ ఫోన్ ని డిజైన్ చేసింది పోకో కంపెనీ. దీని ఫీచర్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ధర కూడా బడ్జెట్ లోపు ఉండడం మరొక ప్లస్ పాయింట్. 

ఫీచర్స్:

108 మెగా పిక్సెల్ ప్రో-గ్రేడ్ మెయిన్ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇందులో 3 ఎక్స్ సెన్సార్ జూమ్ ఆప్షన్ ఇచ్చారు. 3 రెట్లు జూమ్ చేసినా గానీ క్వాలిటీ అనేది తగ్గదని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. దీని అల్ట్రా క్లారిటీతో ప్రతి మూమెంట్ ని క్యాప్చర్ చేయవచ్చు. 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా ఇచ్చారు. ఇక 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చారు. ఇంప్రెసివ్ లార్జ్ 1/1.67 సెన్సార్ ఉన్న కారణంగా లైట్ రాత్రి పూట కూడా ఫోటోలు చాలా స్పష్టంగా వస్తాయి. అద్భుతమైన క్లారిటీతో నైట్ సీన్స్ కొద ప్రకాశించేలా దీని లైట్ క్యాప్చర్ టెక్నిక్ ఉంది. నైట్ ఫోటోగ్రఫీకి ఈ ఫోన్ సూపర్ ఉంటుంది. ఫిల్మ్ కెమెరా ఫీచర్ ని ఈ స్మార్ట్ ఫోన్ లో ఉంచారు. క్యాప్చర్ చేసిన ఫోటోలకు సినిమాటిక్ టచ్ ని ఇవ్వచ్చు. సినిమాటిక్ లుక్ లోకి మీ ఫోటోలు మారిపోతాయి. దీని వల్ల సినిమా హీరోలు, హీరోయిన్స్ లా కనబడతారు.

ఇది 5030 ఎంఏహెచ్ మాసివ్ బ్యాటరీతో వస్తుంది. 19 రోజులు స్టాండ్ బై మోడ్ లో ఉంటుంది. కేవలం మ్యూజిక్ వినడానికి 127 గంటలు వస్తుంది. వీడియోలు చూసినట్లయితే 17 గంటలు పాటు ఛార్జింగ్ నిలబడుతుంది. ఫోన్ కాల్స్ కోసం అయితే 34 గంటలు బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. 100 సైకిల్స్ పూర్తయినా గానీ బ్యాటరీ సామర్థ్యం మాత్రం 80 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. మీడియా టెక్ పవర్ ఫుల్ హీలియో జీ91 అల్ట్రా ప్రాసెసర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ని రూపొందించారు. ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ తో 6.79 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.

90 హెట్జ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఇది 2460X1080 హై రిజల్యూషన్ తో వస్తుంది. సర్టిఫైడ్ ఐకేర్ డిస్ప్లేతో ఈ ఫోన్ వస్తుండడం విశేషం. ఎల్పీ డీడీఆర్4ఎక్స్+ఈఎంఎంసీ 5.1 టెక్నాలజీతో ర్యామ్, మెమొరీ వస్తున్నాయి. ఇది 6 జీబీ +128 జీబీ, 8 జీబీ + 256 జీబీ ఆప్షన్స్ తో వస్తుంది. స్టోరేజ్ ని 1 టీబీ వరకూ ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు. అలానే ర్యామ్ ని 16 జీబీ వరకూ పొడిగించుకునే ఆప్షన్ ఇచ్చారు. ఏఐ ఫేస్ అన్ లాక్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, నెట్ వర్క్ అండ్ కనెక్టివిటీ, సిమ్ 1 + హైబ్రిడ్ సిమ్ ఆప్షన్స్ తో వస్తుంది. షావోమి హైపర్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. 

ఫోన్ తో పాటు వచ్చేవి ఇవే:

మొబైల్ ఫోన్, అడాప్టర్, యూఎస్బీ టైప్ సీ కేబుల్, సిమ్ ఎజెక్ట్ టూల్, ప్రొటెక్టివ్ కేస్, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ కార్డు, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ వస్తాయి. అయితే ప్రాంతాలను బట్టి ప్యాకేజ్ లో ఉన్న కంటెంట్స్ మారచ్చు. 

ఈ పోకో ఎం6 మోడల్ స్మార్ట్ ఫోన్ ని కంపెనీ జూన్ 11న గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ చేయనుంది. ధరల విషయానికొస్తే.. 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ. 10,768గా ఉండనుంది. ఇక 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ. 12,438గా ఉంది. లాంఛింగ్ ఆఫర్ లో భాగంగా దీనిపై డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి