iDreamPost

ఎయిర్‌టెల్ ప్లాన్‌లు: డిస్నీ + హాట్‌స్టార్, నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో టాప్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ప్లాన్‌లు: డిస్నీ + హాట్‌స్టార్, నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో టాప్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ దూకుడు పెంచింది. డిస్నీ + హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా వివిధ OTTలకు సబ్‌స్క్రిప్షన్‌తో, ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తో రూ. 499, రూ. 999, రూ. 1,199, రూ. 1,599ల‌ నాలుగు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌లలో కొన్నింటికి నెట్‌ఫ్లిక్స్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉచిత‌మే. ఏ ప్లాన్ కి ఏంటి ఫ్రీ?

ఎయిర్‌టెల్ రూ. 499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ (Airtel Rs 499 postpaid plan)
Airtel రూ.499 ప్లాన్ 200GB వరకు రోల్‌ఓవర్‌తో, 75GB నెలవారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఎన్నికాల్స్ అయినా చేసుకోవ‌చ్చు. రోజుకు 100 SMSలు. ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌తో పాటు, కాంప్లిమెంటరీగా ఒక యేడాదిపాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. రూ.299 రీఛార్జ్ చేస్తే, ఫ్యామిలీ కనెక్షన్‌లను యాడ్ చేయొచ్చు. ఈ యాడ్-ఆన్ కనెక్షన్‌లకు లిమిటెట్ కాల్‌లు, 30GB డేటా, రోజుకు 100SMS.

ఎయిర్‌టెల్ రూ. 999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్(Airtel Rs 999 postpaid plan)
ఎయిర్‌టెల్ రూ. 999 ప్లాన్ కింద‌, ఒక రెగ్యుల‌ర్ కనెక్షన్, రెండు యాడ్-ఆన్ ఫ్యామిలీ కనెక్షన్‌లు తీసుకోవ‌చ్చు. రెగ్యుల‌ర్ ప్లాన్‌తో సబ్‌స్క్రైబర్ నెలకు 100GB డేటా వ‌ర‌కు వాడుకోవ‌చ్చు, కాల్స్ అన్ లిమిటెడ్. రోజుకు 100 SMSలు. 200GB వరకు డేటా రోల్‌ఓవర్ స‌దుపాయం ఉంది. ప్రతి యాడ్-ఆన్ కనెక్షన్ 30GB డేటా అంద‌నం. ఇక‌ OTT విష‌యానికి వ‌స్తే, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌తో పాటు కాంప్లిమెంటరీగా యేడాదిపాటు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. Wynk ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఫ్రీ.

ఎయిర్‌టెల్ రూ. 1,199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ (Airtel Rs 999 postpaid plan)
Airtel రూ. 1,199 ప్లాన్ , రెగ్యుల‌ర్ క‌నెక్ష‌న్ తోపాటు, ఫ్యామిలీ కోసం రెండు యాడ్-ఆన్ కనెక్షన్‌లను అందిస్తుంది. రెగ్యుల‌ర్ కనెక్షన్‌లు ఉన్న సబ్‌స్క్రైబర్‌లకు 150GB నెలవారీ డేటా వాడుకోవ‌చ్చు, అదే, యాడ్-ఆన్ కనెక్షన్‌లతో 200GB వరకు డేటా రోల్‌ఓవర్ తో, 30GB డేటాను పొందుతాయి. కాల్స్ అన్ లిమిటెడ్. రోజుకు 100 SMSలు, యేడాదికి డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్. కాని నెట్‌ఫ్లిక్స్ బేసిక్ నెలవారీ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తుంది. Wynk ప్రీమియం సభ్యత్వంకూడా,

ఎయిర్‌టెల్ రూ. 1,599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ (Airtel Rs 1,199 postpaid plan)
Airtel రూ. 1,599 ప్లాన్ లో, ప్రతి యాడ్-ఆన్ ప్లాన్‌కు 30GB అదనపు డేటాతో పాటు 250GB నెలవారీ డేటాను అందిస్తుంది. సబ్‌స్క్రైబర్‌లు మూడు యాడ్-ఆన్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ ప్ర‌కారం, 200GB వరకు డేటా రోల్ ఓవర్ ఉంటుంది. అన్ లిమిటెడ్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, ఒక యేడాదిపాటు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్, Wynk ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి