iDreamPost

కీర దోసకాయ వల్ల ఇన్ని రకాలుగా ప్రయోజనాలు..

కీర దోసకాయ వల్ల ఇన్ని రకాలుగా ప్రయోజనాలు..

కీర దోసకాయను అందరూ ఫ్రూట్ సలాట్స్, ఉప్పు కారం పెట్టుకొని తింటూ ఉంటారు. పచ్చిగా కూడా తినవచ్చు. కీర దోసకాయ మనకు ఆరోగ్య పరంగా మరియు మనం అందంగా ఉండడానికి సహాయపడుతుంది. కీర దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ కంటే ఎక్కువ నీటి శాతం కీర దోసకాయలో ఉంటుంది. దీనిని రోజులో ఎపుడైనా తినవచ్చు. కీర దోసకాయలో విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియమ్, ఫైబర్ ఇంకా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇది అన్ని కాలాల్లో కూడా దొరుకుతుంది.

కీర దోసకాయ తినడం వల్ల చేకూరే ప్రయోజనాలు..

*కీర దోసకాయను రోజూ తింటే కిడ్నీలో ఉండే స్టోన్స్ ను కరిగిస్తుంది.
*కీర దోసకాయలో ఉండే ఔషధాలు రొమ్ము, గర్భాశయ, అండాశయ, ప్రోస్టేట్ వంటి క్యాన్సర్ లను రాకుండా మనల్ని కాపాడుతుంది.
*కీర దోసకాయలో ఉండే కాల్షియమ్ ఎముకలను గట్టిగ ఉండేలా చేస్తుంది.
*శరీరంలోని మలినాలనాలను వ్యర్థాలను బయటకు పోయేలా చేస్తుంది.
*ఆహరం తేలికగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
*కీర దోసకాయను రోజూ తింటే పళ్ళు తెల్లగా అయి మరియు నోటిలోని దుర్వాసనను పోగొడుతుంది.
*కీర దోసకాయలో ఉండే ఫ్లావనాయిడ్స్ గుండె ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.
*షుగర్, బీపీ ని కంట్రోల్ లో ఉంచడానికి కీర దోసకాయ సహాయపడుతుంది.

కీరదోసకాయ వల్ల ఆరోగ్యమే కాదు అందంలో కూడా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి..

*కీర దోసకాయని గుండ్రంగా ముక్కలుగా కోసి కళ్ళ కింద ఉంచితే నల్లని వలయాలు పోతాయి.
*కీర దోసకాయ జ్యూస్ ను బాటిల్ లో పోసుకొని ఫ్రిడ్జ్ లో ఉంచుకొని అప్పుడప్పుడు ఫేసుకి స్ప్రే చేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
*కీర దోసకాయ రసంలో కొన్ని నిమ్మకాయ చుక్కల రసం కలిపి పేస్ ప్యాక్ లాగా రాసుకుంటే ముఖం ప్రకాశవంతంగా కనబడుతుంది.
*టేబుల్ స్పూన్ ఓట్స్ లో కీర దోసకాయ గుజ్జును కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే అది మొటిమలను తగ్గిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి