iDreamPost

అక్కడ నీటి కష్టాలు! అల్లాడిపోతున్న ప్రజలు! రూ.2000 పెట్టి కొనాల్సిందే!

People Severe Water Crisis: మార్చి నెల నుంచే ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలు కావడంతో ప్రైవేట్ ట్యాంక‌ర్ల ఓనర్లు దోచుకోవడం మొదలు పెట్టారు.

People Severe Water Crisis: మార్చి నెల నుంచే ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలు కావడంతో ప్రైవేట్ ట్యాంక‌ర్ల ఓనర్లు దోచుకోవడం మొదలు పెట్టారు.

అక్కడ నీటి కష్టాలు! అల్లాడిపోతున్న ప్రజలు! రూ.2000 పెట్టి కొనాల్సిందే!

ఎండాకాలం వచ్చిందంటే బోర్ వెల్స్ ఎండిపోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే తీవ్ర నీటి ఎద్దడి మొదలవుతుంది. మంచి నీటి కోసం సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. స్థానికులు నీటి కష్టాలు పడుతుంటే.. కొంతమంది వాటిని క్యాష్ చేసుకునే పనిలో ఉంటున్నారు. నీటి కోసం చాలా మంది వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. దీంతో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ఓనర్లకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇదే అదునుగా స్థానికులను దోచుకునే పనిలో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు నీటి ఎద్దడి తీర్చాలని ప్రభుత్వ అధికారులను కోరినా.. పెద్దగా స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. బెంగుళూరులో నీటి కష్టాలు మొదలయ్యాయి.. ప్రజలు విలవిలలాడిపోతున్నారు.  వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో నీటి కష్టాలు అప్పుడే మొదలయ్యాయి.  స్థానికులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రైవేట్ ట్యాంకర్ల ఓనర్లు అధిక చార్జీలు వసూళ్లు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నీటి కోసం ట్యాంకర్ల వద్ద పొడవాటి క్యూ లైన్ లో నిలబడే పరిస్థితి నెలకొందని ఆర్ఆర్ నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి నీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. సరిపడ నీళ్లు లేక కొద్దిపాటి నీటితోనే సర్ధుకోవాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. మార్చి ప్రారంభంలోనే నీటి ఎద్దడి ఇంత దారుణంగా ఉంటే.. రాబోయే రెండు నెలలు ఎలా భరించాలో అర్థం కావడం లేదని అంటున్నారు. బెంగుళూరు లో నీటి కొరత ఉందన్న విషయాన్ని గ్రహించిన  వాటర్ ట్యాంకర్ల ఓనర్లు మాఫియాగా ఏర్పడి ప్రజల నుంచి దారుణంగా వసూళ్తు చేస్తున్నారని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లు గతంలో క్యాన్ కి రూ.600 నుంచి రూ.1000 వరకు వసూళ్లు చేసేవారని.. ఇప్పుడు డిమాండ్ బాగా పెరగడంతో రూ.2000 కు పైగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

ఇదిలా ఉంటే ట్యాంకర్ల దోపిడీని అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంకర్లకు ఫిక్స్ ధర నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. బెంగుళూరు నగరంలో నీటిని సరఫరా చేసేందుకు దాదారు రెండు వందల ప్రైవేట్ ట్యాంకర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించినట్లు తెలుస్తుంది. బీఎండబ్ల్యూ‌ఎస్ఎస్‌బి అభ్యర్థన మేర జిల్లా కలెక్టర్ ట్యాంక్లర్ రేట్లను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి 6వేల లీటర్ల నీటి ట్యాంకర్ కి రూ.600 గా నిర్ణయిస్తే.. 8వేల లీటర్లకు రూ.700, 12,000 లీటర్ల ట్యాంకర్ కి ధర రూ.1,000 గా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఒకవేళ అంతకు మించి దూరమైన దానికి అనుగుణంగా రేట్లు పెరుగుతాయని అంటున్నారు. దాదాపు రూ.2000 వేల వరకు ఉండవొచ్చని అంటున్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ ట్యాంకర్ల ఓనర్లపై ఉక్కపాదం మోపడంపై సంతోషం వ్యక్తం చేస్తునారు ప్రజలు.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి