iDreamPost

హిందీ ఛత్రపతికి చక్కని ప్లాన్

హిందీ ఛత్రపతికి చక్కని ప్లాన్

ఇక్కడ సెటిలవ్వడం ఏమో కానీ ఏకంగా బాలీవుడ్ ని టార్గెట్ చేసుకుని అక్కడ డెబ్యూ చేయబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీద నార్త్ ఆడియన్స్ కంటే మన ప్రేక్షకులే ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్టు కనిపిస్తోంది. 15 ఏళ్ళ క్రితం వచ్చిన ఛత్రపతి రీమేక్ అనే పాయింట్ ఒకపక్క అనుమానాలు రేపుతున్నా చాలా కీలకమైన మార్పులు చేసి దాదాపు కొత్త సినిమా అనిపించేలా న్యూ వెర్షన్ ఒకటి సిద్ధం చేశారట. దర్శకుడు వివి వినాయక్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ దీని మీద చాలా కసరత్తు చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ముఖ్యమైన సన్నివేశాలు తప్ప అసలు ఇది ఛత్రపతినేనా అనిపించేలా కొత్తగా ప్రజెంట్ చేస్తారని బెల్లం కంపౌండ్ నుంచి వినిపిస్తున్న టాక్.

ఇంకో విశేషం కూడా ఉంది. దీన్ని తెలుగులో కూడా డబ్ చేయబోతున్నట్టు వినికిడి. అదేంటి ఆల్రెడీ మనం చూసేశాం కదా మళ్ళీ ఎందుకు అనుకుంటున్నారా. చూసి చాలా కాలం అయ్యింది. అందులోనూ మార్పులతో తీస్తున్నారు. సాయి శ్రీనివాస్ కి ఇక్కడ మాస్ లో మార్కెట్ ఉంది. డబ్బింగ్ ఖర్చులు తప్ప పెద్ద కష్టపడాల్సింది ఏముండదు. పైగా ఆర్టిస్టులు కూడా తెలిసిన వాళ్లే ఉంటారు మరోసారి చూద్దామని అనుకునే ప్రేక్షకులు ఉండే ఉంటారు. ఇవన్నీ ఆలోచించే ఛత్రపతి హిందీ రీమేక్ ని తెలుగులో కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారట. అఫీషియల్ గా చెప్పలేదు కానీ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు.

గతంలో ఇలా చూసేసిన కథను మళ్ళీ తీస్తే ఆడిన సందర్భాలు లేకపోలేదు. ఏఎన్ఆర్ దేవదాసు వచ్చిన ఎన్నో ఏళ్ళకు కృష్ణ అదే భగ్నప్రేమికుడి కథలో మళ్ళీ నటించారు. పెద్దగా ఆడలేదు కానీ అప్పట్లో ఇదో సంచలనం. కృష్ణంరాజు ప్రాణస్నేహితులు చేస్తే అదే స్టోరీ మళ్ళీ వెంకటేష్ కొండపల్లి రాజాగా వచ్చింది. భాగ్యరాజ్ చిన్నరాజాని వెంకీ అబ్బాయిగారు గా తీసినప్పుడు అంతే. కార్తీక్ తూర్పు సిందూరం తర్వాత జగపతిబాబు చిలకపచ్చ కాపురం అయ్యింది. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సో ఛత్రపతి హిందీ రీమేక్ ని మళ్ళీ డబ్బింగ్ చేయడం వల్ల వచ్చే నష్టమేమి లేదు కాబట్టి ట్రై చేయొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి