iDreamPost

Bellamkonda Sreenivas : ఛత్రపతి హిందీ రీమేక్ కు కలిసి వస్తోంది

Bellamkonda Sreenivas : ఛత్రపతి హిందీ రీమేక్ కు కలిసి వస్తోంది

కొన్ని నెలల క్రితం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చాయి. డబ్బింగ్ వెర్షన్ అదే పేరుతో యూట్యూబ్ లో ఉండి మిలియన్ల ప్రేక్షకులు దాన్ని చూసేసినప్పుడు మళ్ళీ ఎందుకు తీయడమనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. అయితే వాటిని ఖాతరు చేయకుండా యూనిట్ షూటింగ్ ని పూర్తి చేసింది. పాటలు మినహా టాకీ పార్ట్ ఫినిష్ చేశారు దర్శకుడు వివి వినాయక్. ఒరిజినల్ రైటర్ కె విజయేంద్ర ప్రసాద్ తోనే కొన్ని కీలకమైన మార్పులు చేయించి నార్త్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు కొత్త వెర్షన్ ని సిద్ధం చేయించారు. స్టూవర్టుపురం దొంగ కోసం త్వరగానే పూర్తి చేశారని టాక్.

సరే అసలు విషయానికి వస్తే పుష్ప పార్ట్ 1 ది రైజ్ హిందీలో అదరగొడుతోంది. మనం ఇక్కడ ఏవైతే ప్రధాన మైనస్సులని చెప్పుకున్నామో వాటిని అక్కడి జనాలు పట్టించుకోలేదు. అందులో ఊర మాస్ కంటెంట్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఫలితంగా వసూళ్లు వంద కోట్ల వైపు పరుగులు పెడుతున్నాయి. రీచ్ అవుతుందో లేదో కానీ డెబ్భై కోట్ల ఫిగర్ ని దాటడం అంటే మాటలు కాదు. యుట్యూబ్ లో వ్యూస్ ని చూసుకుని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారా అనే వెక్కిరింపులకు పుష్ప ఫలితం గట్టి సమాధానం చెప్పింది. 83, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ లాంటి బాలీవుడ్ హాలీవుడ్ పోటీని తట్టుకుని మరీ పుష్ప స్ట్రాంగ్ గా నిలబడి సత్తా చాటింది.

కట్ చేస్తే ఇప్పుడు అనూహ్యంగా తెలుగు సినిమాల హిందీ డబ్బింగులుకు, మన హీరోల రీమేకులకు రెక్కలు వచ్చాయి. ఆచార్యని ఫ్యాన్సీ రేట్ కి ఆల్రెడీ అమ్మేసినా అక్కడ హక్కులు కొన్న ప్రొడ్యూసర్ కు డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. రవితేజ ఖిలాడీ కూడా ఇదే తరహా ప్లానింగ్ లో ఉంది. రాబోయే రోజుల్లో తెలుగు సినిమాల హిందీ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఛత్రపతికి ఖచ్చితంగా భారీ బిజినెస్ ఖాయమనే తరహాలో ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి ముందే ఊహించి ప్లాన్ చేసుకున్న ఛత్రపతికి ఇప్పుడీ పుష్ప పరిణామాలు ప్లస్ గా మారబోతున్నాయన్న మాట

Also Read : Shakuntalam : సమంత పాన్-ఇండియా మూవీ “శాకుంతలం” వచ్చేస్తోంది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి