iDreamPost

సిటాడెల్ దెబ్బకు.. అమెజాన్ సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు! ఏమైందంటే?

సిటాడెల్ దెబ్బకు.. అమెజాన్ సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు! ఏమైందంటే?

ఓటీటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండింగ్. టికెట్ కొనుక్కుని థియేటర్ కి వెళ్లి సినిమా చూసే వాళ్లకంటే.. సబ్ స్క్రిప్షన్ కట్టి సినిమాలు చూసే వాళ్లే ఎక్కువయ్యారు. అందుకే ఓటీటీలు కూడా సొంతంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తీయడం ప్రారంభించాయి. ఇంక నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటివి అయితే భారీ భారీ బడ్జెట్లతో వెబ్ సిరీస్ లు తీస్తున్నాయి. అయితే అన్నిసార్లు అవి క్లిక్ అవ్వాలని లేదు. అవి క్లిక్ కాకపోతే ఆ ఓటీటీకి భారీ నష్టాలు తప్పవు. అలా ఇప్పుడు అమెజాన్ పరిస్థితి తయారైంది. సిటాడెల్ వెబ్ సిరీస్ తో వేల కోట్ల నష్టాలు చవిచూస్తోంది.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా లీడ్ రోల్ లో అమెజాన్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా సిటాడెల్ వెబ్ సిరీస్ ని నిర్మించారు. ఏజెంట్స్ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ యాక్షన్ మూవీ తరహాలోనే ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారు. దీనిపై అమెజాన్ ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది. దీనికోసం 250 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.2000 కోట్లు అనమాట. ఈ సిరీస్ రెండు ఎపిసోడ్లు అప్ లోడ్ చేసి.. ఆ తర్వాత వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున రిలీజ్ చేశారు.

అయితే మొదటి రెండు ఎపిసోడ్స్ తర్వాతే ఈ సిరీస్ పై అందరికీ ఆసక్తి పోయినట్లు అయింది. అంతా బాగానే ప్లాన్ చేసినా.. ప్రేక్షకుల్లో మాత్రం ఎందుకో ఆసక్తి రాలేదు. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ ఫ్లాప్ అయింది. పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ విషయాన్ని స్వయంగా అమెజాన్ సీఈవోనే వెల్లడించారు. ఈ ఒక్క వెబ్ సిరీస్ అయితే అమెజాన్ కూడా పెద్దగా పట్టించుకునేది కాకపోవచ్చు. కానీ, లార్డ్ ఆఫ్ ది రిగ్స్(4 వేల కోట్లు), డెడ్ రింగర్స్, ది ఫెరిఫెరల్, డైసీ జోన్స అండ్ ది సిక్స్, ది పవర్ వంటి వెబ్ సిరీస్ లు కూడా అమెజాన్ కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి.

ఇకనైనా ఈ ఫ్లాప్ సిరీస్ లకు చెక్ పెట్టాలని అమెజాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థకు ఇన్ని నష్టాలు మూటకట్టిపెట్టిన సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారి ఉద్యోగాలకు గ్యారెంటీ లేదని బయట టాక్ మొదలైంది. ఇంక ఈ సిటాడెల్ సిరీస్ ని ఇండియా కోసం సమంత, వరుణ్ ధావన్ జోడీగా నిర్మించారు. ఇది రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఒరిజినల్ సిరీస్ లా కాకుండా.. సమంత వర్షన్ గనుక ఇండియాలో క్లిక్ అయితే.. అమెజాన్ కు కాస్త గాకపోతే కాస్త అయినా లాభాలు వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి