iDreamPost

BBL 2023: వీడియో: ప్రయోగాల జోలికెళ్లి పరువు తీసుకుంటున్న బిగ్​బాష్ లీగ్‌!

  • Author singhj Published - 03:25 PM, Tue - 12 December 23

క్రికెట్ అనే కాదు.. ఏ గేమ్​లోనైనా సరికొత్త ప్రయోగాలు చేయడం కామనే. అయితే అవి సక్సెస్ అయితే ఓకే.. కానీ ఫెయిలైతేనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బిగ్​బాష్ లీగ్ పరిస్థితి అలాగే ఉంది.

క్రికెట్ అనే కాదు.. ఏ గేమ్​లోనైనా సరికొత్త ప్రయోగాలు చేయడం కామనే. అయితే అవి సక్సెస్ అయితే ఓకే.. కానీ ఫెయిలైతేనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బిగ్​బాష్ లీగ్ పరిస్థితి అలాగే ఉంది.

  • Author singhj Published - 03:25 PM, Tue - 12 December 23
BBL 2023: వీడియో: ప్రయోగాల జోలికెళ్లి పరువు తీసుకుంటున్న బిగ్​బాష్ లీగ్‌!

క్రికెట్​లో ఇప్పుడు లీగ్స్​దే హవా నడుస్తోంది. టీ20లు, టీ10 ఫార్మాట్​లో మ్యాచ్​లు నిర్వహిస్తూ లీగ్స్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇదంతా మొదలైంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచే. మొదటి టీ20 వరల్డ్ కప్​కు వచ్చిన ఆదరణ చూసి భారత్​లో ఐపీఎల్​ ఐడియాను ఇంప్లిమెంట్ చేశారు. స్టార్ ఆటగాళ్లు, డొమెస్టిక్ ప్లేయర్లను కలిపి ఆడిస్తూ ఒక్కో సిటీకి ఒక్కో ఫ్రాంచైజీని కేటాయించిన ఈ ఫార్ములా ఫుల్ సక్సెస్ అయింది. విదేశీ ఆటగాళ్లు, స్వదేశీ స్టార్లతో పాటు లోకల్ ప్లేయర్స్ కూడా కలసి అదరగొడుతూ లీగ్స్​పై ఆసక్తిని మరింత పెంచారు. ఒక ఏడాదిలో రావాల్సిన ఆదాయం కేవలం నెల, నెలన్నర ఆడితే వస్తుండటం, ఆడియెన్స్​ నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుండటంతో ప్లేయర్లు లీగ్స్ ఆడేందుకు తెగ ఆసక్తి చూపించారు.

ఐపీఎల్​లో ఆడితే తమ లైఫ్ పూర్తిగా మారిపోతుందని క్రికెటర్లు అనుకుంటారు. ముఖ్యంగా డొమెస్టిక్ ప్లేయర్స్​కు అయితే ఇదో గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఇక్కడ సెలక్ట్ అయితే డబ్బుకు డబ్బుతో పాటు బాగా ఆడితే నేషనల్ టీమ్​కు ఎంపికయ్యే అవకాశాలు ఉండటంతో దీన్ని వాళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఫారెన్ ప్లేయర్స్​ కూడా ఐపీఎల్​లో ఆడేందుకు ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే తీవ్ర పోటీ మధ్య ఈ లీగ్​లో ఆడే అవకాశం కొందరినే వరిస్తుంది. ఈ గ్యాప్​ను ఫిల్ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా లీగ్స్ పుట్టుకొచ్చాయి. జీతాలు సరిగ్గా ఇచ్చే పరిస్థితులు లేని వెస్టిండీస్, జింబాబ్వే లాంటి దేశాలకు చెందిన ఎంతో మంది క్రికెటర్లు నేషనల్ టీమ్స్​కు గుడ్ బై చెప్పేసి.. లీగ్స్​లో ఆడుతూ సెటిలైపోతున్నారు.

 

ఇక, ఐపీఎల్​ రేంజ్​లో కాకున్నా వరల్డ్ వైడ్​గా బాగా పాపులర్ అయిన లీగ్స్​లో ఒకటి బిగ్​బాష్. ఆస్ట్రేలియాలో నిర్వహించే ఈ లీగ్​కు ఉన్న క్రేజ్, పాపులారిటీ నెక్స్ లెవల్ అనే చెప్పాలి. ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఈ లీగ్​లో ఆడుతుంటారు. అలాంటి ఈ లీగ్ తన పరువు తానే తీసుకుంటోంది. ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు దీనికి ఎగ్జాంపుల్​గా చెప్పొచ్చు. మ్యాచుల్లో అనవసర ప్రయోగాలకు వెళ్లి బిగ్​బాష్ నిర్వాహకులు లీగ్ పరువు తీస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్న పిచ్ బాగోలేదని ఏకంగా మ్యాచ్​ను ఆపేశారు. పిచ్​పై పడ్డాక బాల్ అనూహ్యంగా బౌన్స్ అవుతుండటంతో బ్యాట్స్​మెన్ గాయపడే ప్రమాదం ఉందని మ్యాచ్​ను ఆపేశారు. ఇప్పుడు కూడా అలాంటి మరో అనూహ్య ఘటన జరిగింది.

సాధారణంగా క్రికెట్​లో కాయిన్​తో టాస్ వేస్తారు. కానీ బిగ్​బాష్​లో బ్యాట్​తో టాస్ వేస్తారు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్​లో ఇలాగే బ్యాట్​ను గాల్లోకి ఎగరేసి టాస్ వేశారు. కానీ బ్యాట్ కాస్తా అటూ, ఇటూ కాకుండా కిందపడ్డాక మధ్యలో ఉండిపోయింది. దీంతో ఇంకోసారి టాస్ వేయాల్సి వచ్చింది. ఈ సీజన్​లో ఇలా జరగడం ఇది రెండోసారట. ఇలా బీబీఎల్ నిర్వాహకుల అనవసర ప్రయోగాల వల్ల ప్లేయర్లు, ఆడియెన్స్​కు చికాకు కలుగుతోందని.. ఇకనైనా దీనికి చెక్ పెట్టాలని అంటున్నారు. మరి.. బీబీఎల్​లో జరుగుతున్న వరుస అనూహ్య ఘటనలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Sikandar Raza: జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాపై ICC బ్యాన్! కారణం ఏంటంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి