iDreamPost

సూపర్ ఛాన్స్.. విద్యార్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా బంపరాఫర్.. ఏంటో తెలుసా?

విద్యార్థుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా బంపరాఫర్ ప్రకటించింది. స్టూడెంట్స్ కోసం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీవోబీ తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులకు భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి.

విద్యార్థుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా బంపరాఫర్ ప్రకటించింది. స్టూడెంట్స్ కోసం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీవోబీ తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులకు భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి.

సూపర్ ఛాన్స్.. విద్యార్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా బంపరాఫర్.. ఏంటో తెలుసా?

ఆర్థిక పరమైన లావాదేవీలకు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. ప్రభుత్వాలు అందించే ఆర్థిక పరమైన పథకాలకు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు తమ ఖాతాదారులకు రకరకాల ఆఫర్స్ ప్రకటిస్తూ ప్రయోజనాలు కల్పిస్తుంటాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగానికి ప్రముఖ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. స్టూడెంట్స్ కోసం బంపరాఫర్ ప్రకటించింది. విద్యార్థుల కోసం కొత్త సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను ప్రారంభించింది. విద్యార్థులకు దీని ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు కలుగనున్నాయి.

బ్యాంకులు విద్యార్థుల కోసం స్కాలర్ షిప్స్ అందిస్తూ వారికి అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. పై చదువుల కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వడ్డీ లేని రుణాలను లేదా వడ్డీలో భారీగా రాయితీలను కల్పించడం వంటి ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్స్ కోసం బీఆర్ఓ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ పేరుతో సేవలను ప్రారంభించింది. ఈ ఖాతాను 16-25 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు ఓపెన్ చేయొచ్చని పేర్కొంది. కనీస బ్యాలెన్స్ లేకుండానే విద్యార్థులు ఈ ఖాతాతో బ్యాంకింగ్ సేవలు పొందవచ్చునని బ్యాంక్ ఆఫ్ బరోడా సీజీఎం రవీంద్ర సింగ్ నేగి వెల్లడించారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా విద్యార్థుల అర్హతకు అనుగుణంగా లైఫ్ టైం ఫ్రీ రూపే ప్లాటినం డెబిట్ కార్డును అందజేస్తుంది. ప్రతి మూడు నెలలకు రెండు సార్లు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ ఉంటది. కొత్త జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ద్వారా విద్యార్థులకు రూ.2 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీ కల్పించనుంది. అంతేగాక ఫ్రీ చెక్ లీవ్స్, ఫ్రీ ఎస్ఎంఎస్ లు, ఈ-మెయిల్ అలర్ట్స్ సేవలను అందించనుంది. ఇక ఈ ఖాతాదారులు డీమ్యాట్ ఖాతా ప్రారంభిస్తే, వార్షిక మెయింటెనెన్స్ చార్జీలు పూర్తిగా మాఫీ చేస్తారు. ఎడ్యుకేషన్ లోన్స్ పై జీరో ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీపై రాయితీ అందిస్తుంది. ఖాతాదారుల అర్హత ఆధారంగా స్పెషల్ క్రెడిట్ కార్డు ఆఫర్లు కూడా అందిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. మరి బ్యాంక్ ఆఫ్ బరోడా విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ఈ జీరో సేవింగ్ అకౌంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి