iDreamPost

కస్టమర్లకు అలర్ట్‌.. ఈ వారం బ్యాంక్‌లకు ఐదు రోజులు సెలవు!

  • Published Jun 26, 2023 | 2:39 PMUpdated Jun 26, 2023 | 2:39 PM
  • Published Jun 26, 2023 | 2:39 PMUpdated Jun 26, 2023 | 2:39 PM
కస్టమర్లకు అలర్ట్‌.. ఈ వారం బ్యాంక్‌లకు ఐదు రోజులు సెలవు!

డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగినా సరే.. బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం తప్పక ఉంటుంది. ఏదో ఒక పని మీద.. బ్యాంక్‌కు వెళ్లాల్సి వస్తుంది. నగదు విత్‌డ్రా చేసేందుకో, డబ్బులు డిపాజిట్ చేసేందుకే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు కోసమో లేదా పాస్‌బుక్, ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి సేవల కోసం బ్యాంక్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక బ్యాంకులకు నెలలో ఎంత లేదన్న.. 8 రోజులు సెలవులు ఉంటాయి. కానీ ఈ వారం బ్యాంక్‌కు ఏకంగా ఐదు రోజులు సెలువులు ఉన్నాయి. కనుక బ్యాంక్‌కు వెళ్లాల్సిన వారు.. ముందు జాగ్రత్తగా మీ పనులను షెడ్యూల్‌ చేసుకుంటే మంచిది అంటున్నారు. బ్యాంక్ సెలవులకు సంబంధించిన క్యాలెండర్‌ను రూపొందిస్తుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని ప్రకారం.. ఈ వారం బ్యాంకులకు 5 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే ఇది ప్రాంతాలను బట్టి మారుతుంది.

ఈవారం 5 బ్యాంక్ సెలవు దినాల్లో ఒకటి ఆదివారం కాగా.. మరో 4 ఇతర రాష్ట్ర పండగల నేపథ్యంలో ఉన్నాయి. ఆ తర్వాత ఈద్ ఉల్ అళా సందర్భంగా జూన్ 28న కేరళ, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ ఉల్ అళాను 3 నుంచి 4 రోజుల పాటు జరుపుకుంటుంటారు. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సెలవులు వివరాలు ఇవే…

  1. 2023, జూన్ 26: ఖార్చి పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు
  2. 2023, జూన్ 28: ఈద్ ఉల్ అళా కారణంగా 28న మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్, కేరళల్లో బ్యాంకులకు సెలవులు.
  3. 2023, జూన్ 29: ఈద్ ఉల్ అళా సందర్భంగానే ఈ రోజు కూడా బ్యాంకులకు సెలవు.
  4. 2023, జూన్ 30: రీమా ఈద్ ఉల్ అళాతో మిజోరం, ఒడిశాల్లో ఈ రోజున బ్యాంకులు బంద్.
  5. 2023, జులై 2 : ఆదివారం

భారతీయ రిజర్వ్ బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం జూన్‌లో మొత్తం 12 రోజులు బ్యాంక్ సెలవులు ఉన్నాయి. ఇందులో శని, ఆదివారాలు కూడా ఉంటాయి. ఇక జులైలో ఇలాగే 15 రోజులు బ్యాంకులు పనిచేయవు. వేర్వేరు రాష్ట్రాల్లో ఇవి వేర్వేరుగా ఉంటాయి. ముహర్రం, గురు హర్‌గోవింద్ జయంతి, అషూరా, కేర్ పూజ వంటి పండగల నేపథ్యంలో జులైలో ఎక్కువగా సెలవులొచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి