iDreamPost

జూలైలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే!

  • Published Jul 01, 2023 | 6:11 PMUpdated Jul 01, 2023 | 6:11 PM
  • Published Jul 01, 2023 | 6:11 PMUpdated Jul 01, 2023 | 6:11 PM
జూలైలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే!

డిజిటల్‌ పేమెంట్స్‌, ఆన్‌లైన్‌ అమ్మకాలు, కొనుగోలు ఎంత పెరిగినా.. బ్యాంకులకు వెళ్లకుండా కొన్ని పనులు సాగవు. ఎఫ్‌డీలు, చెక్‌ విత్‌ డ్రా చేయడం, గోల్డ్‌ లోన్‌ తదితర పనుల కోసం తప్పకుండా బ్యాంక్‌కే వెళ్లాల్సి ఉంటుంది. మన దేశంలో బ్యాంకులకు ఆదివారాలు మాత్రమే కాక.. రెండు, నాలుగో శనివారాలు సెలవు. ఇవి కాక.. పండగలు, పర్వదినాలు, జాతీయ సెలవు దినాలు వంటి రోజుల్లో కూడా బ్యాంక్‌లు సెలవు ఉంటాయి. అందుకే నెల ప్రారంభంలోనే బ్యాంకులకు ఎన్ని రోజులు.. ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకుని దానికి అనుగుణంగా మన పనులను ప్లాన్‌ చేసుకోవచ్చు.

జూన్‌ నెల ముగిసి.. జూలై ప్రారంభం అయ్యింది. ఒకటో తేదీ వచ్చిందంటే కొన్ని కొత్త రూల్స్‌, ఇంధనం ధరలు, గ్యాస్‌ ధరల్లో మార్పులు తప్పనిసరి. అలానే బ్యాంక్‌లు కూడా ఈఏంఐ, ఏవైనా స్కీమ్స్‌కు సంబంధించి వడ్డీ రేట్లలో మార్పులు వంటి నిర్ణయాలను ఫస్ట్‌ తారీఖు నుంచే అమలు చేస్తాయి. అలానే బ్యాంక్‌లకు ఆ నెలలో ఎన్ని సెలవులు అనేది కూడా ఫస్ట్‌ తారీఖునే తెలుస్తుంది. మరి జూలైలో ఎన్ని రోజులు సెలవులు వచ్చాయి అంటే..

ఇప్పుడు జులైలో మొహర్రం, గురు హర్‌గోవింద్ జీ జయంతి, అషూరా, కేర్ పూజ వంటి పండగల నేపథ్యంలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అలానే ఇవి కాక.. శని, ఆదివారాలు కలిపి జూలై నెలలో మొత్తంగా సుమారు 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు. ఆర్‌బీఐ క్యాలెండర్‌ ఈ బ్యాంకుల సెలవులను ప్రకటిస్తుంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ నోటిఫికేషన్ ప్రకారం.. 8 సెలవులు ఉండగా.. ఇవికాక రాష్ట్రాల వారీగా ప్రత్యేక సెలవులు.. అన్ని కలిపి మొత్తం 15 రోజులు సెలవులు ఉన్నాయి.

జూలై నెలలో సెలవులు ఇవే..

జులై 2- ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
జులై 5- గురు హర్‌గోవింద్ జయంతి సందర్భంగా శ్రీనగర్, జమ్మూల్లో ఆ రోజున బ్యాంకులకు సెలవు.
జులై 6- ఎంహెచ్‌ఐపీ డే సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు బంద్
జులై 8- రెండో శనివారం
జులై 9 – ఆదివారం
జులై 11- కేర్ పూజ సందర్భంగా అగర్తలాలో ఈ రోజున బ్యాంకులకు సెలవు.
జులై 13 – భాను జయంతి సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు హాలిడే
జులై 16- ఆదివారం
జులై 17 – యూతిరాట్‌ సింగ్‌ డే సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు హాలిడే
జులై 21- దృక్ప త్యేజీ కారణంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు
జులై 22- నాలుగో శనివారం
జులై 23- ఆదివారం
జులై 28- అషూరా పండగ సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు.
జులై 29- మొహర్రం సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా చోట్ల బ్యాంకులకు సెలవు ఉంది. ఇందులోనే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి.
జులై 30- ఆదివారం

అయితే ఈ సెలవుల కారణంగా బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ.. మొబైల్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్ వంటి సేవలు యథావిధిగా పనిచేస్తాయి. ఇక ఏటీఎం మెషీన్లు, నగదు డిపాజిట్ మెషీన్లు కూడా అందుబాటులో ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి