iDreamPost

ICICI బ్యాంకులో ఉద్యోగం! వేలల్లో జీతం! అయినా.. దొంగగా మారి!

ఓ యువతికి ప్రముఖ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. చాలా కాలం పాటు సదరు బ్యాంక్ విధులు నిర్వహించింది. అయితే ఆమెకు ఉన్న ఓ చెడు కోరిక.. ఆమెను కటకటాల పాలు చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ యువతికి ప్రముఖ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. చాలా కాలం పాటు సదరు బ్యాంక్ విధులు నిర్వహించింది. అయితే ఆమెకు ఉన్న ఓ చెడు కోరిక.. ఆమెను కటకటాల పాలు చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ICICI బ్యాంకులో ఉద్యోగం! వేలల్లో జీతం! అయినా.. దొంగగా మారి!

ప్రతి మనిషికి జీవితంలో ఏదైనా సాధించాలనే కోరిక ఉంటుంది. అలానే కొన్ని కొన్ని ఇతర కోరికలు ఉంటాయి. అయితే కొందరికి ఉండే కోరికలను, ఆశల గురించి వింటే ఆశ్చర్యం కలుగ మానదు. చాలా మంచి పొజిషన్లలో ఉన్న కూడా వారు..చాలా చెడు పనులు చేస్తుంటారు. తాము ఉన్న స్థితికి, చేసే పనికి సంబంధం లేకుండా ఉంటాయి. అలానే ఓ యువతి కూడా ఓ ప్రముఖ బ్యాంకు లో ఉద్యోగం చేస్తుంది. అయితే పాడుపనులకు పాల్పడుతూ చివరకు పోలీసులకు దొరికిపోయింది. ఆమె వ్యహారం పూర్తిగా తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్నాటక రాష్ట్రం బెంగళూరు నగరం ఐటీ హాబ్ కు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన యువతి యువకులు ఉద్యోగాలు చేస్తుంటారు. హాస్టల్స్ లో ఉంటూ తమ విధులకు హాజరవుతుంటారు. అలానే చలాకీ కాఖీని అనే  యువతి నగరంలోని ఐసీఐసీఐ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుండేది. అక్కడ ఉద్యోగం చేస్తూ భారీగానే వేతనం పొందుతుండేది. అయితే ఈమెకు ఓ చెత్త అలవాటు ఉంది.  అందుకే అంత మంచి ఉద్యోగాన్ని మానేసింది. ఈ క్రమంలోనే ఖరీదైన ల్యాప్ టాప్ లను దొంగిలించేది. ముఖ్యంగా పేయింగ్ గెస్ట్‌లు, హోటళ్లలో భోజనం చేసేందుకు వెళ్లే వారు, హాస్టల్ లో ఉండే వారి నుంచి ఆమె ల్యాప్‌టాప్‌లను దొంగిలించేది.

ఐసీఐసీఐ బ్యాంక్ లో పని చేస్తున్నప్పటికీ తన జీతం విలాసవంతమైన జీవితానికి సరిపోవడం లేదని ఆమె ఇలాంటి చెడు పనులకు సిద్ధమైంది. ఎలాగైనా విలాసవంతమైన జీవితాన్ని గడపాలనేది ఆమె కోరికతో ఇలాంటి పక్కదారి ఎంచుకుంది. ఐటీ ఉద్యోగులు ఉన్న బెంగళూరు నగరంలో ల్యాప్‌టాప్‌లను దొంగిలించేందుకు చలాఖీ సిద్ధమైంది. చాలా కాలం పాటు ఇలా దొంగతనాలు చేస్తు పోలీసులకు చిక్కకుండా తిరిగింది. అయితే ఇలా ల్యాప్ టాప్ లు చోరీకి గురవుతున్న ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ చోరీలపై విచారణ చేపట్టిన పోలీసులు చివరకు చలాకీ కాఖీని అరెస్ట్ చేశారు. ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈక్రమంలో ఆమె అనేక సంచనలన విషయాలు వెల్లడించింది. తాను హోటళ్లు, పీజీలను టార్గెట్ చేసేదానిని తెలిపింది.

అలానే హోటల్, పీజీలో బస చేసిన టిఫిన్, భోజనానికి వెళ్తుండగా ల్యాప్ టాప్ దొంగిలించేందానిని వెల్లడించింది. ఆమె నగరంలోని కోరమంగళ, ఇందిరానగర్, హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ల్యాప్‌టాప్ దొంగిలిచినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె నుంచి రూ.10 లక్షలు విలువైన 24 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆ యువతి గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అత్యాశకు పోయి.. ఉన్న ఉద్యోగం వదిలి.. ఇలా చోరీలకు పాల్పడినందుకు తగిన శాస్తి జరిగిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఇలా చోరీలకు పాల్పపడే వారికి ఎలాంటి శిక్షలు విధించాలి?. అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి