iDreamPost

Prashanth Varma: ప్రశాంత్ వర్మతో బాలయ్య సినిమా?

  • Published Mar 13, 2024 | 2:00 PMUpdated Mar 13, 2024 | 2:00 PM

ఇదిలా ఉంటే బాలయ్య తరువాతి సినిమా గురించి ఒక ఆసక్తికరమైన పుకారు ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.కాగా ఈరోజు ఉదయం ప్రశాంత్ వర్మ వేసిన ఒక ట్వీట్ ఈ పుకార్లకు కారణమయింది.

ఇదిలా ఉంటే బాలయ్య తరువాతి సినిమా గురించి ఒక ఆసక్తికరమైన పుకారు ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.కాగా ఈరోజు ఉదయం ప్రశాంత్ వర్మ వేసిన ఒక ట్వీట్ ఈ పుకార్లకు కారణమయింది.

  • Published Mar 13, 2024 | 2:00 PMUpdated Mar 13, 2024 | 2:00 PM
Prashanth Varma: ప్రశాంత్ వర్మతో బాలయ్య సినిమా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ వల్ల ఈ సినిమా పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉండగా, ఇటీవల విడుదలైన టీజర్ తో మరింత క్రేజ్ పెరిగింది. ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ లు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపిస్తారు. కాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే బాలయ్య తరువాతి సినిమా గురించి ఒక ఆసక్తికరమైన పుకారు ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఒక యువ దర్శకుడు బాలకృష్ణను డైరెక్ట్ చేయనున్నారని గట్టి టాక్ వినిపిస్తుంది.

ఆ దర్శకుడు ఎవరో కాదు ఈ సంక్రాంతికి హనుమాన్ అనే సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మనే. కేవలం తెలుగు సినిమా పరిశ్రమనే కాకుండా యావత్ భారతదేశాన్ని షేక్ చేసిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాలయ్యతో సినిమా చేస్తారనే లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. నిజానికి వీరిద్దరూ కలిసి పని చేయడం కొత్తేమీ కాదు. బాలకృష్ణ ఇమేజ్ ను మార్చేసిన ఓటీటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. కాగా ఈరోజు ఉదయం ప్రశాంత్ వర్మ వేసిన ఒక ట్వీట్ ఈ పుకార్లకు కారణమయింది. మార్చి 13 ఉదయం ” బాబు… రెడీ బాబు” అంటూ ట్వీట్ షేర్ చేశారు ప్రశాంత్ వర్మ. కాగా తాను సంతోషించే ప్లేస్ కి మళ్ళీ తిరిగి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు అన్‌స్టాపబుల్ షో మళ్ళీ మొదలయిందా? లేక ఏదన్నా కొత్త సినిమానా? అని రకరకాల కథనాలు అల్లడం మొదలుపెట్టారు.

ఇక హనుమాన్ తరువాత ఆ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ తీస్తున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో మొత్తం పన్నెండు సినిమాలు ఉంటాయని కూడా తెలిపారు. మరి ఇప్పుడు బాలకృష్ణను ప్రశాంత్ జై హనుమాన్ లో నటింపజేస్తారా? లేక వేరే ఏదైనా సూపర్ హీరో క్యారెక్టర్లో చూపిస్తారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. మరి ఈ పుకార్లలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.

హనుమాన్ యూనివర్స్ లో బాలయ్య?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి