iDreamPost

విమానంలో పరిచయం.. కట్‌ చేస్తే ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బాలయ్య!

  • Published Jun 15, 2023 | 6:01 PMUpdated Jun 15, 2023 | 6:01 PM
  • Published Jun 15, 2023 | 6:01 PMUpdated Jun 15, 2023 | 6:01 PM
విమానంలో పరిచయం.. కట్‌ చేస్తే ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బాలయ్య!

టాలీవుడ్‌ హీరోల్లో నటసింహం నందమూరి బాలకృష్ణది ప్రత్యేక ప్రస్థానం. హిట్టు, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు, మూడు సినిమాల్లో నటిస్తాడు బాలయ్య. కుర్ర హీరోలకు ధీటుగా.. ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉంటారు. సినిమాలు, రాజకీయాలు, సేవా కార్యక్రమాలు అంటూ ఫుల్‌ బిజీగా గడుపుతారు బాలయ్య. సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కూడా సత్తా చాటారు బాలయ్య.  ఆహాలో వచ్చిన అన్‌స్టాపబుల్‌ షో కొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేసింది. అంతకుముందు వరకు బాలయ్య అంటే కేవలం కోపం మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని అన్‌స్టాపబుల్‌ షో చూస్తే అర్థం అవుతుంది.

ఇక ఈ విషయాలు పక్కకు పెడితే.. అభిమానుల పట్ల బాలయ్య ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాత్రం వీలు చిక్కినా సరే.. అభిమానుల ఇళ్లకు వెళ్లి వారిలో ఒకరిగా కలిసిపోయి.. వారి ఆతిధ్యాన్ని స్వీకరిస్తారు. అభిమానులను ఆదరించే విషయంలో పేద, ధనిక, కుల, మతాలకు అతీతంగా.. వారితో కలిసిపోయి.. అభిమానులు అంటే తనకు ఎంత అభిమానమో వెల్లడిస్తారు. ఇక తాజాగా ఓ అపరిచిత వ్యక్తికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బాలయ్య. ఆ వివరాలు..

ప్రస్తుతం బాలయ్య వరుస సినిమా షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా బాలయ్య.. అభిమాని విషయంలో తన పెద్ద మనసు చాటుకున్నారు. విమానంలో పరిచయమైన ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి వారికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు బాలయ్య. సదరు వ్యక్తి గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లి.. అభిమానులంటే తనకు ఎంత ఇష్టమో మరోసారి నిరుపించాడు బాలయ్య. సదరు వ్యక్తి పేరు హరీష్‌ వర్మ. కొన్ని రోజుల క్రితం బాలయ్య విమానంలో ప్రయాణిస్తుండగా.. ఆయనకు హరీష్‌తో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో వారు అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఇలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం మాటల సందర్భంలో హరీష్‌ త్వరలోనే తమ ఇంటి గృహప్రవేశం ఉందని.. ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బాలయను ఆహ్వానించాడు. అభిమాని కోరిక మన్నించిన బాలయ​.. హరీష్‌ ఇంట్లో వేడుక ఎప్పుడో డేట్‌ నోట్‌ చేసుకుని.. మరీ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సడెన్‌గా బాలయ్య అక్కడ కనిపించడంతో.. ఆ ప్రాంతంలోని జనాలు ఆశ్చర్యపరిచారు.

తనకు ఓ మనిషి నచ్చితే.. ఎంతవరకు అయినా వెళ్తానని మరోసారి నిరూపించారు బాలయ్య. ఈ క్రమంలోనే సరిగ్గా గృహప్రవేశం రోజు అక్కడికి వెళ్లి.. తన ట్రావెల్ ఫ్రెండ్‌ను ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలయ్యప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించి.. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌ చూస్తే.. ఈ సినిమా ఊర మాస్‌గా ఉండనుంది అని అర్థం అవుతోంది. ఈ చిత్రం తర్వాత బాబీ డైరెక్షన్‌లో మరో సినిమా చేయనున్నారు బాలకృష్ణ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి