iDreamPost

మ్యూజిక్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. 20 ఏళ్ల ప్రస్తానానికి Naa Songs స్వస్తి!

మ్యూజిక్ లవర్స్ కు ఈ వెబ్ సైట్ తెలియకుండా ఉండదు. ఎన్నో ఏళ్ల పాటు అలరిస్తూ వచ్చింది నా సాంగ్స్. ఏ సినిమాలో పాట కావాలంటే.. ముందుగా కనిపించే ఆప్షన్.. ఈ వెబ్ సైట్. ఇప్పుడు ఇది కీలక నిర్ణయం తీసుకుంది.

మ్యూజిక్ లవర్స్ కు ఈ వెబ్ సైట్ తెలియకుండా ఉండదు. ఎన్నో ఏళ్ల పాటు అలరిస్తూ వచ్చింది నా సాంగ్స్. ఏ సినిమాలో పాట కావాలంటే.. ముందుగా కనిపించే ఆప్షన్.. ఈ వెబ్ సైట్. ఇప్పుడు ఇది కీలక నిర్ణయం తీసుకుంది.

మ్యూజిక్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. 20 ఏళ్ల ప్రస్తానానికి Naa Songs స్వస్తి!

సినిమాల్లోని నచ్చిన పాటలు వినాలన్నా,చూడాలన్నా ఇప్పుడు యూట్యూబ్, గానా, స్పాటిపై, జియో సావన్, వింక్, అమెజాన్, హంగామా వంటివి ఆశ్రయిస్తుంటారు. వీటిల్లో డౌన్ లోడ్ ఆప్షన్ ఉంటే వెంటనే డౌన్ లోడ్ బటెన్ పై ప్రెస్ చేసి.. ఫోనులో సేవ్ చేసుకుని వింటుంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ యాప్స్. కానీ ఒకప్పుడు ఇవన్నీ అందుబాటులోకి రానప్పుడు మ్యూజిక్ అభిమానులను అలరించిన వెబ్ సైట్ ఏదంటే.. నా సాంగ్స్. కామ్ (Naa Songs. Com). ఏ సినిమా పాట కావాలన్నా నా సాంగ్స్ అని సెర్చ్ ఇంజన్ గూగుల్‌లో టైప్ చేస్తే చాలు.. దానికి సంబంధించిన లింక్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి.. ఏ సినిమా పాట కావాలంటే.. ఆ పేరు సెర్చ్ చేయగానే.. ఆ మూవీలోని సాంగ్స్ లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది.

వెంటనే మనకు నచ్చిన పాటను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రీళ్లు, సీడీలకు కాలం చెల్లిపోతున్న రోజుల్లో.. నేనున్నానంటూ వచ్చింది సినీ ప్రియుల్ని సంగీత సాగరంలో ముంచెత్తేందుకు. ఇంటర్నెట్ సులభతరం కాని రోజుల్లోనే బెస్ట్ సేవలు అందించింది ఈ సైట్. అలా పాటలు డౌన్ లోడ్ చేసి.. మొబైల్‌కు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ ఉండేవాళ్లు.. అందులో దొరకని సినిమా ఉండేది కాదేమో బహుశా. పాత కాలం సినిమాల నుండి ఈ తరం సినిమాల వరకు అనేక పాటలను తనలో పొందుపరుచుకుని.. మ్యూజిక్ లవర్స్‌ను ఆకర్షించింది సైట్. ఇప్పుడు ఈ సైట్ తన ప్రస్థానానికి ముగింపు  చెప్పబోతోంది. అవును మీరు వింటున్నది నిజమే. ఎన్నో ఏళ్ల పాటు సంగీత ప్రియులను ఆనందంలో ముంచేసిన ఈ సైట్ ఇక కనిపించకపోవచ్చు.

Naa songs farewell

ఇది మేము చెప్పడం లేదు. ఆ సంస్థే స్వయంగా ఫేర్ వెల్ ప్రకటించింది. సుమారు 20 సంవత్సరాల పాటు సర్వీస్ చేసిన ఈ వెబ్ సైట్ తన సేవలకు విరామం తెలిపింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ‘2003 నుండి 2023 వరకు సంగీత ప్రపంచంలో భాగస్వామ్యం అయినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఫేర్ వెల్ చెబుతున్నాం. మీ ప్రేమ, మద్దతుకు మేము ప్రశంసిస్తున్నాం. మీరు సురక్షితంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం’ అంటూ తన సేవలకు వీడ్కోలు పలికింది. రెండు దశాబ్దాల పాటు అనేక మంది సినీ, మ్యూజిక్ అభిమానులు దీన్ని ఎప్పడోకప్పుడు ఆశ్రయించిన వారే. ఇప్పుడు ఈ పాటల పూదోట మూగబోతుంది. మరి అందులో నిక్షిప్తమైన పాటలు ఇప్పుడు లభిస్తాయో లేవో చూడాలి. మీరు ఏదైనా సాంగ్ కోసం నా సాంగ్స్ ను ఆశ్రయించి ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి