iDreamPost

Bachchan Paandey : ఇలా అయ్యిందేంటి అక్షయ్

Bachchan Paandey : ఇలా అయ్యిందేంటి అక్షయ్

స్టార్ హీరోగా అక్షయ్ కుమార్ కున్న మార్కెట్ మనకు తెలియంది కాదు. విభిన్న కథలతో ప్రయోగాలు చేస్తూనే రెగ్యులర్ మసాలా సినిమాలతోనూ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అందుకే సూర్యవంశీ మంచి వసూళ్లు రాబట్టుకోగలిగింది. కానీ బచ్చన్ పాండే విషయంలో ఇది పూర్తిగా రివర్స్ అయ్యింది. సోషల్ మీడియాలో నెటిజెన్లు కంటెంట్ గురించి విమర్శలు గుప్పిస్తుండగా ఒరిజినల్ వెర్షన్ లోని ఆత్మను చంపేసి ఇష్టం వచ్చిన్నట్టు తీశారని తమిళ ఆడియన్స్ దుమ్మెత్తిపోశారు. మొదటి రోజు తరన్ ఆదర్శ్ లాంటి ట్రేడ్ విశ్లేషకులు సినిమా చాలా బాగుందని మోసినా అదంతా పెయిడ్ వ్యవహారమని తర్వాత అర్థమైపోయింది.

ఇప్పడు బాక్సాఫీస్ వద్ద బచ్చన్ పాండే పరిస్థితి తీసికట్టుగా తయారవుతోంది. ది కాశ్మీర్ ఫైల్స్ దెబ్బ మాములుగా పడలేదు. ఎప్పుడో పది రోజుల క్రితం వచ్చిన ఆ సినిమా కంటే బచ్చన్ పాడే కలెక్షన్లు సగమే ఉన్నాయంటే సిచువేషన్ అంత బ్యాడ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. దెబ్బకు ముందు 6 వారాలు తర్వాత అనుకున్న ప్రైమ్ ఓటిటి స్ట్రీమింగ్ ని ఇప్పుడు 4 వారాలకు కుదించారు. అంటే నెలకే స్మార్ట్ స్క్రీన్ పై వచ్చేస్తుందన్న మాట. ఇందుకుగాను 80 కోట్లు నిర్మాతకు సేఫ్ అయినట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ కనక బ్లాక్ బస్టర్ అయితే బచ్చన్ పాండే ఇక ప్యాకప్ చెప్పేసుకుని థియేటర్ల నుంచి మాయామవ్వాల్సిందే.

ట్విస్ట్ ఏంటంటే మహారాష్ట్రలోని ప్రసిద్ధ మరాఠా మందిర్ లో మ్యాట్నీ షోకు బచ్చన్ పాండే రెండు టికెట్లు అడ్వాన్స్ గా బుక్ అయ్యాయి. అదే హాల్ లో గత పాతికేళ్ళుగా రోజుకో షో చొప్పున ప్రదర్శిస్తున్న దిల్వాలే దుల్హనియా లేజాయేంగేకు 20 టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. అక్షయ్ కుమార్ కు ఇంత కన్నా వేరే అవమానం వేరే కావాలా. పైగా ఇది ఎప్పుడో తమిళం తెలుగు కన్నడలో రీమేక్ అయిన సినిమా కావడంతో సౌత్ లో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న అక్షయ్ కుమార్ కాస్త కంటెంట్ మీద కూడా సీరియస్ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఇలాంటివి ఓటిటికి వదలడం ఉత్తమం

Also Read : Raj Tarun : కుర్రహీరోకి మేల్కోవాల్సిన టైం వచ్చేసింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి