iDreamPost

బాబు జైలు నుంచి బయటకు రావడమే TDPకి మైనస్ అయ్యిందా?

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కేసులు చుట్టు తిరుగుతున్నాయి. అంతేకాక ఇటీవలే ఆయన అనారోగ్య నిమిత్తం బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ సర్కిల్ లో ఓ వార్త వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కేసులు చుట్టు తిరుగుతున్నాయి. అంతేకాక ఇటీవలే ఆయన అనారోగ్య నిమిత్తం బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ సర్కిల్ లో ఓ వార్త వైరల్ అవుతోంది.

బాబు జైలు నుంచి బయటకు రావడమే TDPకి మైనస్ అయ్యిందా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశంలోనే చాలా ఢిఫరెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఎన్నికలు లేకున్నా సరే ఎప్పుడూ అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. నిత్యం అధికార వైసీపీ,ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇటీవల చంద్రబాబు అరెస్టు అయిన తరువాత  ఏపీ పొలిటికల్ కొత్త టర్న్ తీసుకుంది. సమస్యల విషయం వదిలేసి.. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్టు అంశంపైనే టీడీపీ రాద్ధాంతం చేసిందనే వార్తలు వినిపించాయి. బాబు కోసం అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక తమకు ఫుల్ మైలేజ్ వచ్చిందని భావించారు.  అయితే తాజాగా బాబుజైలు నుంచి బయటకు రావడమే టీడీపీకి మైనస్ అయ్యిందనే పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.

ఏపీ స్కిల్ డైవలప్మెంట్ స్కాంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ తరువాత మధ్యంతర బెయిల్  మీద బయటకు వచ్చారు.  ఆయన జైల్లో ఉండగా టీడీపీ.. అరెస్టుకు నిరసనగా పలు కార్యక్రమాలు చేపట్టింది. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి ఓ యాత్రను చేపట్టారు. లోకేశ్ కూడా భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించాడానికి సిద్ధమయ్యాడు. అంతేకాక చంద్రబాబు అరెస్టు అంశంపై టీడీపీ పలు నిరసన కార్యక్రమాలు  చేపట్టారు. బాబు జైల్లో ఉండగా నిత్యం ఏదో ఒక కార్యక్రమాని టీడీపీ చేస్తుండేది.

ఇటీవలే ఆయనకు కంటి చికిత్సకూడా జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.  చంద్రబాబు జైల్లో ఉండగా  ఆయనకు సంఘీభావంగా నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరిగేవి. న్యాయం గెలవాలంటూ భువనేశ్వరి తన తంటాలేవో పడేవారు.  కానీ బాబు బయకు రావడంతో అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి.  చంద్రబాబు బయటకి రావడంతో ఆయన్ను అన్యాయ, అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌నే చ‌ర్చ‌కు ముగింపు ప‌లికిన‌ట్టైందని టాక్. ఇప్పుడు ఈ కేసు వ్య‌వ‌హారం న్యాయ‌స్థానాల్లో న‌డుస్తుండ‌డంతో ఎవ‌రూ పెద్ద‌గా మాట్లాడటం లేదు. బాబు అరెస్ట్‌ను ప్రజలు కూడా మ‌రిచిపోయారు.

తాజా పరిణామాలతో చంద్రబాబును మర్చిపోయే పరిస్థితి వస్తోందా అనే అనుమానాలు టీడీపీ శ్రేణుల్లో కలుగుతోంది. అంతేకాక చంద్రబాబు బయటకు రావడమే టీడీపీ మైనస్ అయ్యిందని రాజకీయ విశ్లేషలకు కూడా అభిప్రాయ పడుతున్నారు. ష‌ర‌తుల‌పై చంద్ర‌బాబుకు న్యాయ‌స్థానం బెయిల్ ఇచ్చింది. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు బ‌దులు జూబ్లీహిల్స్‌లోని సొంతింటిలో బాబు అరెస్టు అయ్యార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక లోప‌ల ఏం జ‌రుగుతున్న‌దో, బాబు ఏం చేస్తున్నారో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదంట.

ఇక బాబు ధైర్యం చేసి.. ప్రత్యక్షంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తే, బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ తిరిగి జైలుకు పంపుతారనే భయం ఆయనలో ఉందని టాక్. ఇలా టీడీపీ భ‌విష్య‌త్ వ్యూహం ఏంటో తెలియ‌డం లేదు కానీ, ప్ర‌స్తుతానికి అంతా స్త‌బ్ధత నెల‌కుంది.  అలా బాబు బయటకు రావడంతో టీడీపీ  మైనస్ అయ్యిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి