iDreamPost

బుమ్రా కంటే మా బౌలర్ గొప్ప అంటున్న బాబర్.. మైండ్ దొబ్బిందా? అంటూ ఫ్యాన్స్ ఫైర్!

మరోసారి బాబర్ అజామ్ తన తెలివితక్కువ తనాన్ని బయటపెట్టుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా కంటే తమ బౌలరే గొప్ప అంటూ ప్రగల్భాలు పలికాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మరోసారి బాబర్ అజామ్ తన తెలివితక్కువ తనాన్ని బయటపెట్టుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా కంటే తమ బౌలరే గొప్ప అంటూ ప్రగల్భాలు పలికాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బుమ్రా కంటే మా బౌలర్ గొప్ప అంటున్న బాబర్.. మైండ్ దొబ్బిందా? అంటూ ఫ్యాన్స్ ఫైర్!

పాకిస్తాన్ ఆటగాళ్లకు ఖాళీగా ఉంటే ప్రాక్టీస్ చేసుకోడం తెలీదు గానీ.. ఊరికే టీమిండియా ప్లేయర్లపై పడి ఏడుస్తుంటారు. భారత ఆటగాళ్లపై అడ్డగోలుగా విమర్శలు చేయడం పాక్ ప్లేయర్లకు అలవాటుగా మారిపోయింది. ఇక ఈ విమర్శలపై టీమిండియా ప్లేయర్లు, ఫ్యాన్స్ ఘాటుగానే రిప్లేలు ఇస్తుంటారు. తాజాగా మరోసారి టీమిండియా ప్లేయర్ పై పనికిమాలిన వ్యాఖ్యలు చేశాడు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్. బుమ్రా కంటే మా బౌలరే గొప్ప అంటూ గొప్పలు చెప్పుకున్నాడు. దీంతో ఇండియన్స్ ఫ్యాన్స్ మైండ్ దొబ్బిందా? డాక్టర్ దగ్గరికి వెళ్లు అంటూ సలహా ఇస్తున్నారు. అసలేం జరిగిందంటే?

జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ పేసర్లలో ఒకడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తన యార్కర్లతో, స్వింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించగలడు. ఇక బుమ్రా బౌలింగ్ కు హేమాహేమీ బ్యాటర్లే కళ్లు తేలేస్తారు. అలాంటి బుమ్రా కంటే మా బౌలరే గొప్ప అంటూ చెప్పుకొచ్చాడు పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న బాబర్ ఈ కామెంట్స్ చేశాడు. టీ20 మ్యాచ్ చివరి ఓవర్లో 10 రన్స్ ను డిఫెండ్ చేయడానికి బుమ్రా, నసీమ్ లలో ఎవరిని ఎన్నుకుంటావ్? అని బాబర్ ను అడగగా..

బాబర్ సమాధానం ఇస్తూ..”నేను ఎలాంటి ఆలోచన లేకుండా నసీమ్ షానే ఎన్నుకుంటాను. ఎందుకంటే? బుమ్రా కంటే అతడు చాలా యంగ్. పైగా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కామెంట్స్ కాస్త వైరల్ కావడంతో.. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. బుమ్రాతో ఆ పిల్ల బచ్చాకు పోలికేంటి? బుమ్రా ఎక్కడ? అతడెక్కడ? అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. బాబర్ నీ మైండ్ దొబ్బినట్లుంది.. వెళ్లి డాక్టర్ కు చూపించుకో, మా తడాఖా టీ20 వరల్డ్ కప్ లో చూపిస్తాం అని మరికొందరు కాస్త ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి బుమ్రా కంటే నషీమ్ షా గొప్ప అన్న బాబర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి