iDreamPost

మా ఆర్మీ ట్రైనింగ్‌ను టీ20 వరల్డ్‌ కప్‌లో చూపిస్తాం: బాబర్‌ అజమ్‌

  • Published Apr 18, 2024 | 6:05 PMUpdated Apr 18, 2024 | 6:05 PM

Babar Azam, Army Training: పాకిస్థాన్‌ క్రికెటర్లు, ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఏం చేసినా వింతగానే ఉంటుంది. ఇటీవల ఆ దేశ క్రికెటర్లకు పీసీబీ ఆర్మీ ట్రైనింగ్‌ ఇప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ ట్రైనింగ్‌ను మ్యాచ్‌లో చూపిస్తాం అంటున్నాడు బాబర్‌ అజమ్‌. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Babar Azam, Army Training: పాకిస్థాన్‌ క్రికెటర్లు, ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఏం చేసినా వింతగానే ఉంటుంది. ఇటీవల ఆ దేశ క్రికెటర్లకు పీసీబీ ఆర్మీ ట్రైనింగ్‌ ఇప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ ట్రైనింగ్‌ను మ్యాచ్‌లో చూపిస్తాం అంటున్నాడు బాబర్‌ అజమ్‌. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 18, 2024 | 6:05 PMUpdated Apr 18, 2024 | 6:05 PM
మా ఆర్మీ ట్రైనింగ్‌ను టీ20 వరల్డ్‌ కప్‌లో చూపిస్తాం: బాబర్‌ అజమ్‌

క్రికెట్‌ను జెంటిల్‌మెన్‌ గేమ్‌ అంటారు. కానీ, క్రికెట్‌ను కొన్ని సందర్భాల్లో కామెడీ గేమ్‌గా మార్చింది మాత్రం పాకిస్థాన్‌ అనే చెప్పాలి. వాళ్ల ఫీల్డింగ్‌ విన్యాసాలతో సీరియస్‌ మ్యాచ్‌లో కూడా పొట్టపగిలిపోయేలా నవ్వించే టాలెంట్‌ వారి సొంతం. పైగా ఎప్పుడు ఎలా ఆడతారో వాళ్లకు తెలియదంటూ పాకిస్థాన్‌ టీమ్‌పై జోకులు కూడా పేలుతూ ఉంటాయి. తరాలు మారినా, కొత్త తరం క్రికెటర్లు ఎంత మంది వచ్చినా.. పాకిస్థాన్‌ స్టైల్‌ మాత్రం మారడం లేదు. తాజాగా ఆ దేశ క్రికెట్‌ బోర్డు తమ ఆటగాళ్లకు ఏకంగా ఆర్మీ ట్రైనింగ్‌ ఇప్పించిన విషయం తెలిసిందే. అరె.. క్రికెట్‌లో రాణించాలంటే మంచి క్రికెట్‌ కోచ్‌ దగ్గర కోచింగ్‌ ఇప్పించాలి గానీ, ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌, జాగింగ్‌ లాంటివి చేయాలి, అలా కాదని ఆర్మీ క్యాంప్‌కు తీసుకెళ్లి, గోడలు దూకించడం, కొండలు ఎక్కించడం, గన్నులు గురిపెట్టడం నేర్పించారు. క్రికెటర్లు ఇవన్నీ ఎందుకంటూ.. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అయితే.. ఇది శారీరక శ్రమతో పాటే తమలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఉపయోగపడుతుందని పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ అంటున్నాడు.

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో పాకిస్థాన్‌ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. బాబర్‌ అజమ్‌ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించి, పెద్ద షాకిచ్చాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు షాహీన్‌ షా అఫ్రిదీని పాకిస్థాన్‌ టీ20 కెప్టెన్‌గా నియమించింది. కానీ, అఫ్రిదీ కెప్టెన్సీలో పాక్‌ టీమ్‌ తేలిపోవడంతో మళ్లీ బాబర్‌ చేతికే పగ్గాలు అప్పగించింది పీసీబీ. తాజాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైంది పాకిస్థాన్‌. ఈ నెల 18 నుంచి 27 వరకు మొత్తం ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Babar Azam

తాము టీ20 వరల్డ్‌ కప్‌ కోసం చాలా కష్టపడుతున్నామని, దానిపైనే ఫోకస్‌ పెట్టినట్లు తెలిపాడు. టీ20 వరల్డ్‌ కప్‌ టార్గెట్‌గా ప్రిపేర్‌ అవుతున్న తమకు ఆర్మీ ట్రైనింగ్‌ ఎంతో ఉపయోగపడిందని, ఫిట్‌నెస్‌ పరంగానే కాకుండా, మానసికంగా తాము చాలా దృఢంగా మారేందుకు ఈ ఆర్మీ ట్రైనింగ్‌ ఎంతో యూజ్‌ అవుతుందని పేర్కొన్నాడు. గతంలో కూడా మేం ఇలాంటి ఆర్మీ ట్రైనింగ్స్‌లో పాల్గొన్నామని, మ్యాచ్‌లో దాని ఫలితం మీరు చూస్తారంటూ బాబర్‌ ధీమా వ్యక్తం చేశాడు. జూనియర్లు, సీనియర్లతో కలిసి తమ టీమ్‌ ఎంతో బ్యాలెన్సింగ్‌గా ఉందని పేర్కొన్నాడు. మరి ఆర్మీ ట్రైనింగ్‌లో తీసుకున్న శిక్షణను మ్యాచ్‌ చూపిస్తామంటూ బాబర్‌ అజమ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి