iDreamPost

Ayodhya Ram Mandir: రామ మందిర్ సాకారం వెనుక పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కష్టం! ఖర్చులన్నీ!

  • Published Jan 22, 2024 | 8:27 AMUpdated Jan 24, 2024 | 5:57 PM

నేడు అయోధ్యలో ప్రారంభోత్సవం జరుపుకోనున్న రామ మందిర సాకారం వెనక ఎంతో కృషి ఉండగా.. వారిలో మన తెలుగు వాడైనా పుల్లారెడ్డి పాత్ర కూడా ఉంది. అప్పట్లోనే ఆయన అయోధ్య ఉద్యమం కోసం లక్షల్లో ఖర్చు చేశారు. ఆ వివరాలు..

నేడు అయోధ్యలో ప్రారంభోత్సవం జరుపుకోనున్న రామ మందిర సాకారం వెనక ఎంతో కృషి ఉండగా.. వారిలో మన తెలుగు వాడైనా పుల్లారెడ్డి పాత్ర కూడా ఉంది. అప్పట్లోనే ఆయన అయోధ్య ఉద్యమం కోసం లక్షల్లో ఖర్చు చేశారు. ఆ వివరాలు..

  • Published Jan 22, 2024 | 8:27 AMUpdated Jan 24, 2024 | 5:57 PM
Ayodhya Ram Mandir: రామ మందిర్ సాకారం వెనుక పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కష్టం! ఖర్చులన్నీ!

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశమంతా సంబరాలు కొనసాగుతున్నాయి. సుమారు ఐదు శతాబ్దాల నిరీక్షణకు నేటితో తెరపడింది. నేడు అనగా జనవరి 22, సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ.. అయోధ్య ఆలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రతి హిందువు వేయి కళ్లతో ఎంతో భక్తిగా ఎదురు చూస్తున్నాడు. రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. ఆలయాలన్ని రామ నామ శోభతో వెలుగొందుతున్నాయి. నాలుగేళ్ల క్రితం అనగా 2019 నవంబర్ 9న సుప్రీం కోర్టు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఆ తర్వాత వెంటనే మందిర నిర్మాణం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతానికి గర్భాలయం మాత్రమే పూర్తయ్యింది.

అయితే రామ మందిర నిర్మాణం కోసం మోదీ ప్రభుత్వం రూపాయి ఖర్చు చేయలేదు. భక్తులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. మందిర నిర్మాణం కోసం భారీగా విరాళాలు సమర్పించారు. మందిరం కోసం సుమారు 3 వేల కోట్ల రూపాయల వరకు విరాళాలు రాగా.. ఇప్పటి వరకు ఆలయ నిర్మాణం కోసం 1800 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇంకా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వద్ద ఇప్పటికీ భారీ మొత్తంలో నిధులు ఉన్నాయి.

Head of Pullareddy Sweets for Rama Mandir is difficult

అయితే భక్తులు కేవలం మందిర నిర్మాణం కోసం మాత్రమే కాక.. అయోధ్య పోరాట సమయంలో కూడా ఇంతే భారీ ఎత్తున​ విరాళాలు ఇచ్చారట. వీరిలో పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత గుణంపల్లి పుల్లారెడ్డి కూడా ఉన్నారు. అయోధ్య ఉద్యమం సమయంలో ఆయన వీహెచ్‌పీ కోశాధికారిగా పని చేస్తుండేవారు. దాంతో ఉద్యమం కోసం ఎంతో ఖర్చు చేశారు. ఆఖరికి తన ఇంటిని అమ్మటానికి కూడా సిద్ధపడ్డారట.

వెంటనే 2 లక్షలు.. ఇంటిని అమ్మడానికి రెడీ

సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత నేడు.. అయోద్య మందిర నిర్మాణం సాకారం అయ్యింది. అయితే ఆలయ నిర్మాణం కోసం సాగించిన పోరాటంలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కీలక పాత్ర పోషించింది. అయోధ్య ఉద్యమం సమయంలో వీహెచ్‌పీ అంతర్జాతీయ కోశాధికారి అయిన పుల్లారెడ్డి.. అయోధ్య రామ మందిర న్యాయపోరాటానికి అవసరమైన ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు.

కోర్టు ఖర్చుల కోసం వీహెచ్‌పీకి రూ.25 లక్షలు అవసరమయ్యాయి. దాంతో వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ హైదరాబాద్ వచ్చి పుల్లారెడ్డిని కలిశారు. ఖర్చులకు అవసరమైన డబ్బులు గురించి చెబుతూ బాధపడ్డారు. అయితే అశోక్‌ సింఘాల్‌ బాధ చూడలేకపోయిన పుల్లారెడ్డి.. అప్పటికప్పుడు ఇంట్లో నుంచి రూ.2 లక్షలు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు.

ఆ తర్వాత అదే రోజు సాయంత్రంలోగా మరో రూ.10 లక్షలు సర్దుబాటు చేస్తానని సింఘాల్‌కు మాట ఇచ్చారు పుల్లారెడ్డి. తనకు తెలిసిన వారి దగ్గర ఆ మొత్తం తీసుకొని అశోక్ సింఘాల్‌కు ఇచ్చారు. అంతేకాక కోర్టు ఖర్చుల కోసం ఎర్రమంజిల్‌లోని తన ఇంటిని అమ్మేయడానికైనా సిద్ధమని, తన భార్య నగలు సైతం ఇచ్చేస్తానని పుల్లారెడ్డి చెప్పారు. రామ మందిరం కోసం తన ఆస్తి మొత్తం ధారబోసేందుకు సిద్ధమయ్యారు పుల్లారెడ్డి. రామ మందిరమే తన తొలి ప్రాధాన్యమని అనేక సందర్భాల్లో చెప్పారు. అంతేకాక తాను బతికి ఉన్నంత వరకు కోర్టు ఖర్చులకు ఎలాంటి లోటు రాకుండా చూస్తానని పుల్లారెడ్డి.. అశోక్ సింఘాల్‌కుహామీ ఇచ్చారు.

అనేక గుప్త దానాలు..

పుల్లారెడ్డి మరణించిన అనంతరం ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించిన తర్వాత నిర్వహించిన శ్రద్ధాంజలి సభలో అశోక్ సింఘాల్ స్వయంగా ఈ విషయాలు వెల్లడించారు. అయోధ్య కేసులో గెలుస్తామని.. రామ మందిరం నిర్మాణం ఎప్పటికైనా జరిగి తీరుతుందని పుల్లారెడ్డి బలంగా నమ్మారని నాడు అశోక్‌ సింఘాల్‌ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన కల సాకారం అవుతోంది. ఇక పుల్లారెడ్డి తన జీవిత కాలమంతా.. సంఘ్ పరివార్ సంస్థలకు తెలుగునాట పెద్ద దిక్కుగా నిలిచారు. రామకృష్ణ మఠం లాంటి సంస్థలకు గుప్త దానాలు చేశారు. అంతేకాక అబిడ్స్‌లో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం కోసం పుల్లారెడ్డి 950 గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు.

పుల్లారెడ్డి నేపథ్యం ఇది..

నేడు పుల్లారెడ్డి స్వీట్లు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్నాయి. నాణ్యత, రుచికి పుల్లారెడ్డి స్వీట్లు మారుపేరుగా నిలుస్తాయి. కేవలం ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న పుల్లారెడ్డి.. నేడు ఆయన వ్యాపారాన్ని దేశమంతా విస్తరించారు. విదేశాలకు సైతం తమ స్వీట్లను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. పుల్లారెడ్డి వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన కర్నూలు జిల్లాలోని 1920, ఆగస్టు 12న కర్నూలు జిల్లాలోని గోకవరం గ్రామంలో జన్మించారు. పుల్లమ్మ, హుస్సేన్ రెడ్డి ఆయన తల్లిదండ్రులు. ఐదో తరగతి వరకు చదువుకున్న ఆయన బాబాయి సాయంతో మిఠాయి దుకాణం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపారాన్ని విస్తరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి