iDreamPost

అద్భుతం చేసిన బాలరాముడు.. అయోధ్యలో పోయిన పర్స్‌.. హరిద్వార్‌లో ప్రత్యక్షం

  • Published Jan 26, 2024 | 2:29 PMUpdated Jan 26, 2024 | 2:32 PM

Ayodhya: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసుకున్న బాలరాముడు తన మహిమ చూపడం ప్రారంభించాడు అంటున్నారు. ఇందుకు సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

Ayodhya: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసుకున్న బాలరాముడు తన మహిమ చూపడం ప్రారంభించాడు అంటున్నారు. ఇందుకు సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

  • Published Jan 26, 2024 | 2:29 PMUpdated Jan 26, 2024 | 2:32 PM
అద్భుతం చేసిన బాలరాముడు.. అయోధ్యలో పోయిన పర్స్‌.. హరిద్వార్‌లో ప్రత్యక్షం

వందల ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ.. జనవరి 22 సోమవారం నాడు.. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. తొలి రోజు సుమారు ఏడు వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుక సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సామాన్యులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. వేడుక జరిగి ఐదు రోజులు అవుతున్నా.. ఎక్కడ చూసినా బాలరాముడికి సంబంధించి ఏదో వార్త వైరల్‌ అవుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ఓ అద్భుతం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం అయోధ్య వచ్చిన ఓ వృద్ధురాలి పర్సు పోయింది. దాన్నిండా కరెన్సీ నోట్లు, ముఖ్యమైన కార్డులు ఉన్నాయి. పోయిన పర్స్‌ గురించి వృద్ధురాలి కుటుంబం పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చింది. ఆ తర్వాత వారు తిరిగి సొంత ఊరికి వెళ్లారు. అయితే తాజాగా ఆ పర్స్‌ దొరికింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బిలియనీర్ శ్రీధర్ వెంబు కుటుంబం జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం అతని తల్లి జానకి (80)తో కలిసి అయోధ్యకు చేరుకున్నారు.

ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధురాలు జానకి ఆలయానికి వెళ్లిన సమయంలో పర్సు పోగొట్టుకుంది. ఈ పర్సులో రూ.63,550 నగదు, ఆధార్ కార్డుతో సహా పలు వస్తువులు ఉన్నాయి. పర్సు పోయిన విషయం గుర్తించి బాధపడింది. ఆ తర్వాత బాలరాముడిని దర్శించుకునే సమయంలో.. తన పర్స్‌ తిరిగి తనకు దొరకాలని కోరుకుంది. ఆ తర్వాత జానకి కుమారుడు శ్రీధర్ వెంబు పోలీసులకు తల్లి పర్సు పోయిన విషయం ఫిర్యాదు చేసి తిరిగి తమిళనాడు లోని తంజావూరుకు సమీపంలోని తెన్‌కాశికి చేరుకున్నాడు.

అయితే జానకి పోగొట్టుకున్న పర్సు అయోధ్యకు 680 కిలోమీటర్ల దూరంలోని హరిద్వార్‌లో ఒక సన్యాసి వద్ద బయటపడింది. సాధువు సుధ ప్రేమానంద్ మహరాజ్ కూడా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. వృద్ధురాలి పర్సు అతని బ్యాగ్‌లో పడింది. తన సంచిలో ఉన్న పర్సుని గుర్తించిన సాధువు అందులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులను సంప్రదించారు. వారు దర్యాప్తు చేయడంతో శ్రీధర్‌ ఇచ్చిన ఫిర్యాదు గురించి తెలిసింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు.. శ్రీధర్‌కు కాల్‌ చేసి.. వారి పర్స్‌ దొరికిందని.. దానిలో ఆధార్ కార్డు, పూజ సామాగ్రి, నగదు రూ.66,290 ఉన్నాయని తెలిపారు. వచ్చి వాటిని తీసుకెళ్లాల్సిందగా సూచించారు.

దీంతో బుధవారం రామాలయానికి వచ్చిన శ్రీధర్‌కు ఎస్‌ఎస్‌ఎఫ్‌ ఇన్‌ఛార్జ్‌ యశ్వంత్‌సింగ్‌ పర్సు ఇచ్చారు. పర్సులో ఉన్న చిన్న గంట తన తల్లి జానకికి చాలా ప్రత్యేకం అని.. దాన్ని నిత్యం పూజలో ఉపయోగిస్తారని .. పోయిన పర్సు తిరిగి పొందడం పట్ల సంతోషంగా ఉందని తెలిపాడు. తన తల్లి పర్సును సురక్షితంగా అందజేసిన తరువాత రామమందిరం వద్ద సీఎం యోగి ఏర్పాటు చేసిన భద్రతపై ప్రశంసల వర్షం కురిపించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి