iDreamPost

రూ.కోటి 75 లక్షల విలువైన 703 స్మార్ట్ ఫోన్స్ చోరీ.. నడిచి వెళ్లే వాళ్ళే టార్గెట్..

ఫోన్ ని దొంగతనం చేసే వారిలో రెండు రకాలు ఉంటారు. మొదటి రకం వాళ్ళు.. కొంతమంది ఆటోడ్రైవర్లే కస్టమర్ చేతి నుంచి ఫోన్ లాక్కుని పోతారు. రెండో రకం వాళ్ళు రాత్రి సమయంలో టార్గెట్ చేస్తారు. ఇప్పుడు చెప్పుకోబోయేది రెండో రకం వాళ్ళ గురించే. వీళ్ళు ఏకంగా కోటి 75 లక్షల విలువ చేసే 703 కాస్ట్లీ ఫోన్స్ ని దొంగిలించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. 

ఫోన్ ని దొంగతనం చేసే వారిలో రెండు రకాలు ఉంటారు. మొదటి రకం వాళ్ళు.. కొంతమంది ఆటోడ్రైవర్లే కస్టమర్ చేతి నుంచి ఫోన్ లాక్కుని పోతారు. రెండో రకం వాళ్ళు రాత్రి సమయంలో టార్గెట్ చేస్తారు. ఇప్పుడు చెప్పుకోబోయేది రెండో రకం వాళ్ళ గురించే. వీళ్ళు ఏకంగా కోటి 75 లక్షల విలువ చేసే 703 కాస్ట్లీ ఫోన్స్ ని దొంగిలించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. 

రూ.కోటి 75 లక్షల విలువైన 703 స్మార్ట్ ఫోన్స్ చోరీ.. నడిచి వెళ్లే వాళ్ళే టార్గెట్..

రాత్రిపూట ఒంటరిగా నడిచి వెళ్లే వాళ్ళని టార్గెట్ చేసుకుని కొంతమంది రెచ్చిపోతున్నారు. నడిచి వెళ్లిన వారిని ఆపి కొట్టి వారి దగ్గరున్న స్మార్ట్ ఫోన్స్ ని ఎత్తుకెళ్ళేవాళ్ళు హైదరాబాద్ నగరంలో ఎక్కువైపోయారు. తాజాగా మొబైల్స్ స్నాచింగ్ కి పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో సూడాన్ దేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఉండగా.. 12 మంది హైదరాబాద్ కి చెందిన వారు ఉన్నారు. వీళ్ళ నుంచి కోటి 75 లక్షల రూపాయల విలువైన 703 స్మార్ట్ ఫోన్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

సిటీలోనూ, తెలంగాణ రూరల్ ఏరియాల్లో తరచుగా మొబైల్ ఫోన్ స్నాచింగ్స్ జరుగుతున్నట్లు గుర్తించామని సీపీ అన్నారు. రాత్రి సమయంలో ఆఫీసుల నుంచి వచ్చేవారిని, రెస్టారెంట్ నుంచి వచ్చేవారిని, సినిమా చూసి వస్తున్న వారిని టార్గెట్ చేసి వాళ్ళ నుంచి మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లిపోతున్నారని అన్నారు. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళని, బైక్ మీద వెళ్ళేవాళ్ళని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. టైం ఎంత అయ్యింది? పలానా చోటుకి వెళ్ళడానికి బస్ ఎప్పుడు వస్తుంది? అని మాటల్లో పెడతారని.. రాత్రి 11.30, 12 గంటల ప్రాంతంలో సెల్ ఫోన్లు, కొన్ని సందర్భాల్లో డబ్బులు కూడా దొంగతనం కూడా చేస్తున్నారని తెలిపారు. అయితే సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నామని.. అడిగితే డబ్బుల కోసమే చేస్తున్నామని చెప్పినట్లు వెల్లడించారు.

ఒకరిద్దరు వ్యక్తులు తమ వద్ద నుంచి దొంగలు సెల్ ఫోన్లు ఎత్తుకుపోతుంటే గట్టిగా పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అయితే వారిని పోలీసులు విచారించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీళ్లంతా ఒక ముఠాగా ఏర్పడి స్నాచింగ్ లకు పాల్పడుతున్నారని అన్నారు. ఇదొక ఇంటర్నేషనల్ రాకెట్ అని.. ఈ రాకెట్ లో సూడాన్ కి చెందిన ఐదుగురు అక్రమ వలసదారులు కూడా ఉన్నారని అన్నారు. ఇదంతా సూడాన్ దేశానికి లింక్ అయి ఉందని.. ముఠాలో ఒకరు సూడాన్ కి షిప్స్ లో సెల్ ఫోన్స్ ని ప్యాక్ చేసిన బాక్సుల్లో పంపిస్తారని తెలిపారు. వీళ్ళు దొంగతనం చేసిన ఫోన్లలో అన్నీ లేటెస్ట్ మోడల్స్ అని.. ఐఫోన్లు, ఒప్పో వంటి కంపెనీ ఫోన్లే అని.. వీటిని సూడాన్ దేశంలో ఎక్కువ రేటుకి అమ్ముతున్నారని సీపీ తెలిపారు.   

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి