iDreamPost

10 వేల ఒంటెలను చంపాలని నిర్ణయం… ఎక్కడో తెలుసా…?

10 వేల ఒంటెలను చంపాలని నిర్ణయం… ఎక్కడో తెలుసా…?

ఈ భూమి అనేక జీవరాసులకు నిలయం. ఎన్నో ప్రకృతి అందాలకు నిలయమైన భూమిపై కొన్ని కారణాల వల్ల జీవరాసులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఈ భూమిపై నివసించిన ఎన్నో జీవరాసుల అంతరించిపోయాయి. అప్పట్లో గ్రహశకలాలు ఢీ కొట్టడం అడవులకు నిప్పు అంటుకోవడం వల్ల గతంలో ఆ జీవులు అంతరించి పోయాయి. కానీ ఇప్పుడు మాత్రం మానవ తప్పిదాల వల్లనే జీవరాసుల మనుగడ ప్రమాదంలో పడుతుంది. వివరాల్లోకి వెళితే …

ఆస్ట్రేలియాలో ఏర్పడిన కార్చిచ్చు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. ఆ మంటలను అదుపు చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్న మంటలు అదుపుకావడం లేదు. ఇప్పటికే కార్చిచ్చులో చిక్కుకుని సుమారు 5 కోట్ల జంతువులు మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వం కూడా మంటలు అదుపుచేయడం తమ వల్ల కాదని చేతులెత్తేసింది.

ఇదిలా ఉంటె ఆస్ట్రేలియా ప్రభుత్వం 10 వేల ఒంటెలను చంపాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మంటల్లో చిక్కుకుని అనేక మూగజీవులు చనిపోతుంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. కానీ ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణం లేకపోలేదు. మంటలవల్ల తీవ్ర గడ్డుకరమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల జీవనానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. నీళ్లు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు.

కాగా అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు వల్ల ఒంటెలు జనావాసాల్లోకి చొరబడి ఇళ్లల్లో ఉన్న నీటిని తాగేసి ఏసీలను పాడుచేసి అందులో ఉన్న నీళ్లు కూడా తాగి వెళ్ళిపోతున్నాయని దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వం ఒంటెలను చంపాలని నిర్ణయించుకుంది. ఇదే అంశమై అనంగు పిజంజజరా యకుంనిజజరా(ఏపీవై) ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ మెంబర్‌ మరీటా బేకర్‌ స్పందిస్తూ ఒంటెలు ప్రజలను చాల ఇబ్బంది పెడుతున్నాయని దానికి తోడు సంవత్సరానికి ఒక టన్ను మీథేన్ గ్యాస్ విడుదలకు కారణం అవుతున్నాయని తెలిపారు.

దీనితో ఒంటెలను నిర్ములించడానికి హెలికాఫ్టర్లను కూడా సిద్ధం చేసింది. 10 వేల ఒంటెలను ఎంచుకుని వాటిని చంపిన తరువాత వాటి కళేబరాలను తగలబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జంతు ప్రేమికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ప్రపంచానికి ఆక్సీజెన్ అందించే అడవులుగా పేరుబడ్డ అమెజాన్ అడవుల్లో కూడా కార్చిచ్చు వ్యాపించడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేసారు. ప్రపంచానికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్ అడవుల్లో మంటలు వ్యాపించడంతో వాటిని అదుపు చేయడానికి ప్రపంచదేశాలు తమ వంతు సాయం చేయడానికి ముందుకొచ్చాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు అదుపుచేయలేనంతగా కార్చిచ్చు వ్యాపించడం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి