iDreamPost

అగ్గిపెట్టె మచ్చపై దాడి.. 4 రోజులపాటు ఇంట్లో బంధించి!

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అగ్గిపెట్టె మచ్చపై హైదరాబాద్ లో దాడి జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. నాలుగు రోజుల పాటు ఇంట్లో బంధించి కొట్టారని, తప్పించుకుని స్వగ్రామానికి వచ్చారట.

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అగ్గిపెట్టె మచ్చపై హైదరాబాద్ లో దాడి జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. నాలుగు రోజుల పాటు ఇంట్లో బంధించి కొట్టారని, తప్పించుకుని స్వగ్రామానికి వచ్చారట.

అగ్గిపెట్టె మచ్చపై దాడి.. 4 రోజులపాటు ఇంట్లో బంధించి!

సోషల్ మీడియా పుణ్యమాని కొంత మందికి సెలబ్రిటీలుగా మారుతున్నారు. నేమ్, ఫేమ్ రాగానే ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు. యూట్యూబ్, ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిపోతున్నారు. అనామకులు సైతం ఈ సామాజిక మాధ్యమాల ద్వారా పాపులర్ అవుతున్నారు. కుర్చీతాత లాంటి తాగుబోతు సైతం.. ఆ కుర్చీ మడత పెట్టి అన్న డైలాగ్‌తో ఫేమస్ అయిన సంగతి విదితమే. అలా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు అగ్గిపెట్టె మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ కూడా ఉన్నాడు. సోషల్ మీడియాలో తన వీడియోలతో ఫన్ క్రియేట్ చేస్తుంటాడు. ఇది సినిమాల్లో నటించే అవకాశాన్ని కూడా తెచ్చిపెట్టింది. వినరో భాగ్యము విష్ణు  కథలో  చిన్న పాత్రలో మెరిశాడు.  తాజాగా ఇతడిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. షూటింగ్ పేరుతో హైదరాబాద్ తీసుకెళ్లి తనను నాలుగు రోజుల పాటు నిర్బంధించి కొట్టారని చెబుతున్నాడు.

ఈ నెల 14న వైజాగ్ సత్య షూటింగ్ ఉందని తీసుకెళ్లిన తర్వాత.. ఇబ్బంది పెట్టారని, కొట్టారని అగ్గిపెట్టె మచ్చ మీడియా ముందు వాపోయాడు. తప్పించుకుని పారిపోయినట్లు పేర్కొన్నాడు.  అక్కడకు వెళ్లాక.. తమను ఫోన్ కూడా మాట్లాడనివ్వలేదని చెబుతున్నాడు అతడి సోదరుడు శ్రీకాంత్. ‘అన్నకు ఫోను చేస్తుండగా.. ఎవరూ ఎత్తలేదు. తర్వాత మా అత్త ఫోన్ ఎత్తి.. మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లారు. అక్కడ బంధించి కొట్టారని ఏడుస్తూ చెప్పింది.. పోలీసులకు కంప్లయిట్ చేయాలని చెప్పాను. వెంటనే నేనే 100కు డయల్ చేసి వైజాగ్ సత్య నంబర్ ఇచ్చాను. ఆ తర్వాత అతనికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశాడు. ఎందుకు కొట్టారని అడిగాను. కుర్చీల ఆట ఆడమన్నారు. ఆ సమయంలో డైరెక్టర్‌ను కొరికేశాడని వైజాగ్ సత్య చెప్పాడు. ఒకరి ఏమీ అననిదే మా అన్న ఏమీ అనడు ’ అని చెబుతున్నాడు శ్రీకాంత్. తర్వాత వారిద్దరూ తప్పించుకుని ఇక్కడకు వచ్చేశారని, పోలీసులకు కంప్లయింట్ ఇస్తామని పేర్కొన్నాడు.

అగ్గిపెట్టె మచ్చకు ఫుల్‌గా తాగించారని, వైజాగ్ సత్య దగ్గర ఉండి కొట్టించాడని, అతడు మాకు అన్నీ అబద్దాలు చెబుతున్నాడని పేర్కొన్నాడు సోదరుడు శ్రీకాంత్. కాగా, వైజాగ్ సత్య దీనిపై స్పందించారు. ’ బిగ్ బాస్ పేరడీని పెద్ద బాస్ అనే కార్యక్రమాన్నిరూపొందిస్తున్నాం. ఐదు రోజుల షూటింగ్ అనుకున్నాం. యూట్యూబ్ కోసం నేను, ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు, రాకేష్ మాస్టర్ భార్య, గుంటి నాగరాజు, అగ్గిపెట్టె మచ్చ ఇలా 10 మందితో పెద్ద బాస్ షో చేస్తున్నాం. దీనికి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ విజ్జి గౌడ్, యాంకర్ చందు. మాకు రెమ్యునరేషన్ తక్కువైనా.. అగ్గిపెట్టె మచ్చకు ఎక్కువ ఇప్పించాను. స్పెషల్ రూం కూడా ఇచ్చాం. మందు, ఫుడ్ ఇచ్చాం. కానీ కంటెంట్ ఇచ్చేవాడు కాదు. షూటింగ్‌కు సహకరించేవాడు కాదూ..దీంతో ప్రొడ్యూసర్ విజ్జి గౌడ్.. ఏంటీది నాలుగు, ఐదు లక్షలు పెట్టాను.. కంటెంటె ఇవ్వకపోతే ఎలా అని అగ్గిపెట్టె మచ్చాను అడిగితే.. అతడిపై దూకి కొరికాడు. బూతులు తిట్టాడు. దీంతో అతడు కొట్టాడు. ఇద్దరు కొట్టుకున్నారు. మళ్లీ షూటింగ్ స్టార్ అయ్యింది. కానీ మరో రోజు మైకులు, కెమెరాలు పగులగొట్టాడు. దీంతో 40 లక్షలు నష్టం వచ్చింది. దీంతో ఇబ్బంది ఎందుకులే అని బస్ బుక్ చేసి ఇంటికి పంపించేశాను’ అని వెల్లడించాడు వైజాగ్ సత్య.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి