iDreamPost

Rakesh Master: రాకేష్ మాస్టర్ చనిపోతారని 2 నెలల ముందే తెలుసు! సంచలన నిజాలు బయటపెట్టిన అసిస్టెంట్ సాజిద్

  • Author Soma Sekhar Published - 11:40 AM, Mon - 19 June 23
  • Author Soma Sekhar Published - 11:40 AM, Mon - 19 June 23
Rakesh Master: రాకేష్ మాస్టర్ చనిపోతారని 2 నెలల ముందే తెలుసు! సంచలన నిజాలు బయటపెట్టిన అసిస్టెంట్ సాజిద్

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం (జూన్ 18)న సాయంత్రం 5 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం అందరికి తెలిసిందే. పలు అనారోగ్యకారణాల చేత ఆయన మరణించారు. ఆయన మృతి టాలీవుడ్ షాక్ కు గురిచేసింది. రాకేష్ మాస్టర్ తన ఇంటర్వ్యూల ద్వారా టాలీవుడ్ హీరోలపై అలాగే తన శిష్యుడు అయిన శేఖర్ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన విచిత్రమైన యాటిట్యూడ్ తో పాటుగా నిర్మొహమాటంగా ఆయన చేసే విమర్శలు ఆయన్ని వివాదాల్లో పడేసేవి. తాజాగా ఆయన మరణం గురించి అసిస్టెంట్ సాజిద్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. రాకేష్ మాస్టర్ చనిపోతారని తనకు రెండు నెలల ముందే తెలుసన్నారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణంపై అసిస్టెంట్ సాజిద్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. రాకేష్ మాస్టర్ బతకడం కష్టమే అని రెండు నెలల క్రితమే డాక్టర్లు చెప్పినట్లు సాజిద్ తెలిపాడు. గతంలో తాను రాకేష్ మాస్టర్ కు ఎడిటర్ గా పనిచేశానని, దాంతో తనపై నమ్మకంతో ప్రతి విషయం తనతో చెప్పేవారని వెల్లడించాడు సాజిద్. కొన్ని రోజుల క్రితం ‘హనుమాన్’ మూవీ క్లైమాక్స్ షూటింగ్ లో రాకేష్ మాస్టర్ పాల్గొన్నారని తెలిపాడు.

ఈ క్రమంలోనే మాస్టర్ కు రక్తపు విరోచనాలు, వాంతులు అయ్యాయని, అప్పుడు నేనే హాస్పిటల్ కు తీసుకెళ్లాను అని సాజిద్ వెల్లడించాడు. ఆ సమయంలోనే పరీక్షలు చేసిన డాక్టర్లు బతకడం కష్టమని తెలిపినట్లు సాజిద్ వివరించాడు. దాంతో రాకేష్ మాస్టర్ రెండు నెలలు మద్యం కూడా మానేశాడని సాజిద్ తెలిపాడు. మాస్టర్ మరణించాడానికి కొన్ని రోజుల ముందు మ్యాన్షన్ హౌస్ మై హౌస్ షో చేయడానికి విజయనగరం వెళ్లారు. ఆ షో తర్వాత గబ్బర్ సింగ్ బ్యాచ్ తో ఓ షో ను ప్లాన్ చేసినట్లు సాజిద్ వెల్లడించాడు. కానీ ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి