iDreamPost

రెండో పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి.. ప్రభుత్వం కొత్త రూల్స్

రెండో పెళ్లి చేసుకుంటే.. భార్యకు చెప్పకపోయినా.. తమ అనుమతి తప్పనిసరి అంటోంది ఓ ప్రభుత్వం. అది ఆడవాళ్లైనా, మగవాళ్లైనా సరే. జీవిత భాగస్వామి ఒప్పుకున్నా కూడా తమ అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకోకూడదని చెబుతుంది.

రెండో పెళ్లి చేసుకుంటే.. భార్యకు చెప్పకపోయినా.. తమ అనుమతి తప్పనిసరి అంటోంది ఓ ప్రభుత్వం. అది ఆడవాళ్లైనా, మగవాళ్లైనా సరే. జీవిత భాగస్వామి ఒప్పుకున్నా కూడా తమ అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకోకూడదని చెబుతుంది.

రెండో పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి.. ప్రభుత్వం కొత్త రూల్స్

గతంలో బహుభార్యత్వం ఉండేది. వ్యక్తి.. ఇద్దరు,ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకునేవారు. అయితే అదీ రానూ రానూ తగ్గుముఖం పట్టింది. సమాజం మారుతుండటంతో మానవ జీవన విధానాలపై కూడా ప్రభావం చూపింది. ఏక పత్నిగా మారాడు భర్త. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా బహుభార్యత్వం  కొనసాగుతుంది. భార్య బ్రతికి ఉండగానే వివాహాలు చేసుకుంటున్నారు. లేదంటే మరో మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. దీంతో కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహుభార్యత్వాన్ని అణచివేసేందుకు.. కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.

భార్య/భర్త బతికి ఉండగా.. మరో పెళ్లికి సిద్ధమైతే..కుటుంబ సభ్యులకు, స్నేహితులు చెప్పినా చెప్పకపోయినా..ఆ ప్రభుత్వానికి చెప్పాల్సిందే. ఎందుకంటే అటువంటి నిర్ణయాలు చేసింది అస్సాం ప్రభుత్వం. జీవిత భాగస్వామి ఒప్పుకున్నా.. రెండో పెళ్లికి సిద్ధమైయ్యే ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మగవాళ్లైనా, మహిళలైనా.. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా.. భార్య బతికి ఉండగా.. మరో వివాహానికి సిద్ధమైతే.. తమ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోరాదంటూ పేర్కొంది. ఉద్యోగుల వ్యక్తిగత చట్టం మరో పెళ్లికి అనుమతిచ్చినా.. తమకు చెప్పాల్సిందేనని చెప్పింది. ఈ మేరకు అక్టోబర్ 20న ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆగస్టులో బహుభార్యత్వాన్ని రాష్ట్రంలో నిరోధించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి బిస్వా శర్మ ప్రకటన చేయగా.. తాజాగా ఈ ఉత్తర్వులను సీఎస్ నీరజ్ వర్మ జారీ చేశారు. ‘అస్సాం సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) రూల్స్ 1965లోని రూల్ 26లోని నిబంధనల ప్రకారం.. భార్య జీవించి ఉన్న ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా.. ప్రభుత్వ అనుమతి లేకుండా మరొక వివాహం చేసుకోకూడదని స్పష్టం చేస్తున్నాం. ప్రభుత్వ అనుమతి లేకుండా భార్య ఉన్న వ్యక్తిని ఏ మహిళా ప్రభుత్వ ఉద్యోగి వివాహం చేసుకోకూడదు’ అని ఆదేశాల్లో పేర్కొనబడి ఉంది. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమించినట్లయితే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి