iDreamPost

ఆ ప్లేయర్లను తక్కువ చేసి చూడొద్దు.. ఫ్యాన్స్​ను కోరిన అశ్విన్!

  • Author singhj Published - 04:09 PM, Wed - 23 August 23
  • Author singhj Published - 04:09 PM, Wed - 23 August 23
ఆ ప్లేయర్లను తక్కువ చేసి చూడొద్దు.. ఫ్యాన్స్​ను కోరిన అశ్విన్!

క్రికెట్​లో టీమ్ సెలెక్షన్ అనేది ఎప్పుడూ వార్తల్లో నిలిచే అంశమనే చెప్పాలి. అందులోనూ భారత్ లాంటి క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్న దేశంలో టీమ్ సెలెక్షన్ ఎక్కువగా వివాదాస్పదం అవుతూ ఉంటుంది. ఒక్క ప్లేయర్​ను పక్కన పెట్టినా పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. ఇప్పుడు ఆసియా కప్ టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా చర్చకు తెరలేచింది. ఈ టీమ్ సూపర్బ్​గా ఉందని కొందరు మెచ్చుకుంటే.. మరికొందరు స్క్వాడ్​పై పెదవి విరిచారు. ఈ జట్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సహా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్​కు చోటు దక్కలేదు.

మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్​తో పాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆసియా కప్​ టీమ్​కు సెలెక్ట్ అయ్యారు. దీంతో వీరిని ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ఎంపిక చేశారనే విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్​లో స్పందించాడు. ఐర్లాండ్ టూర్​లో ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచుల్లోనూ తిలక్ సరిగా ఆడలేదన్న అశ్విన్.. అతడు మొదటి నుంచి దూకుడుగా ఆడాలనే లక్ష్యంతో ఉన్నాడని తెలిపాడు. ఇప్పటితరం యంగ్ ప్లేయర్లు చాలా స్పష్టమైన ఆలోచనలతో క్రీజ్​లోకి వస్తున్నారని చెప్పాడు. తిలక్ సెలెక్షన్ టీమ్​లో కొత్తదనం తీసుకొస్తుందని అశ్విన్ పేర్కొన్నాడు. అతడ్ని బ్యాకప్ కోసమే తీసుకున్నట్లు తెలుస్తోందన్నాడు.

‘భారత జట్టు రెండోసారి వన్డే ప్రపంచ కప్ గెలిచేందుకు ప్రధాన కారణం ప్లేయర్లపై నమ్మకం ఉంచి మద్దతుగా నిలవడమే. ఆటగాళ్లు ఫామ్​లోకి వచ్చే వరకు బాసటగా ఉండాలి. సూర్య ఎంత ప్రమాదకార బ్యాటర్ అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఐపీఎల్ గురించి చర్చ జరుగుతోంది. ఐపీఎల్ ముగిస్తే ప్రతి ఒక్కరూ టీమిండియా ప్లేయరే. ఆ లీగ్​లో తమ జట్టు కోసం అద్భుతంగా ఆడి.. జాతీయ జట్టు కోసం విఫలమైతే ఐపీఎల్​ ముగిసినా ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆటగాళ్లను ఎలా ఎంపిక చేయాలో సెలెక్టర్లకు బాగా తెలుసు. టీమ్​లో తమకు ఇష్టమైన ప్లేయర్లు లేకపోతే వెంటనే కామెంట్లు చేసేస్తున్నారు. ఇతర ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. ప్లేయర్లను అవమానించడం ఆపండి’ అని అభిమానులను అశ్విన్ కోరాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి