iDreamPost

ఆంటీ ఆంటీ అంటూ ట్రోలింగ్.. అరియానా స్ట్రాంగ్ కౌంటర్!

ఆంటీ ఆంటీ అంటూ ట్రోలింగ్.. అరియానా స్ట్రాంగ్ కౌంటర్!

అరియానా గ్లోరీ.. సోషల్ మీడియా యూజర్లకు, ఆర్జీవీ అభిమానులకు, బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. లైఫ్ లో ఎక్కడ మొదలయ్యాం అని కాదు.. ఎక్కడికి చేరుకున్నాం అనేది ముఖ్యం అనడానికి.. అరియానాని బెస్ట్ ఉదహరణగా చెప్పచ్చు. లైఫ్ లో ఒక గోల్ పెట్టుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదాకు చేరుకుంది. అయితే ఈ స్థాయి ఊరికే రాలేదు. ఎంతో కష్టపడితేనే వచ్చింది. కానీ, కొందరు మాత్రం సెలబ్రిటీలు అనగానే చాలా ఈజీగా మాటలు అనేస్తారు. అలాగే అరియానా విషయంలో కూడా అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. వాటికి అరియానా స్ట్రాంగ్ రిప్లయ్ కూడా ఇచ్చింది.

అరియానాకు ఆర్జీవీ, బిగ్ బాస్ బిగ్ బ్రేక్ ఇచ్చాయనే చెప్పాలి. ముఖ్యంగా బిగ్ బాస్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన టాలెంట్ తో ఇప్పుడు సెలబ్రిటీ యాంకర్ గా, సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుఎన్సర్ గా కొనసాగుతోంది. అయితే కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు.. సెలబ్రిటీలు అనగానే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో నోరేసుకు పడిపోతారు. చాలా మంది అలాంటి కామెంట్స్ విషయంలో సాధ్యమైనంత వరకు స్పందించరు. కానీ, అరియానా మాత్రం అలా ఊరుకోలేదు. తనను ట్రోల్ చేసే వారికి తన స్టైల్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పనీపాట లేకుండా.. ఒకరిపై ఆధారపడి బితికే వాళ్లే ఇలా ఇంకొకరిపై పడి ఏడుస్తారంటూ ఫైర్ అయిపోయింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వీడియో స్టోరీగా షేర్ చేసింది.

అరియానా మాట్టాడుతూ.. “పనిపాటాలేని వేస్ట్ ఫెలోస్ కి ఇది. సన్నగా ఉంటే సన్నగా ఉన్నాను అంటావు. లావు అయితే లావుగా ఆంటీలాగా ఉన్నాను అంటావు. అసలు.. నువ్వెలా ఉంటావ్? ధైర్యంగా పోస్టు పెట్టు.. నేనూ చూస్తాను. లావైపోతే నీకేంటి? సన్నగా అయిపోతే నీకేంటి? ఎట్ లీస్ట్ నేను నా లైఫ్ లో ప్రోగ్రెస్ అవుతున్నాను. నువ్వేం చేస్తున్నావ్ రా? సీటు ఆనబెట్టి కామెంట్లు చేస్తున్నావ్. ప్లీజ్ ధైర్యం ఉంటే ముందుకొచ్చి మాట్లాడుకదరా.. నీదేం పోతుంది. జస్ట్ బుర్ర, మనసు కరెక్ట్ గా ఆలోచిస్తే బాగుంటుంది. ఆలోచించకపోయినా పర్వాలేదు. అది నీ బతుక్కి వదిలేద్దాం. అవతలి వాళ్ల మీద పడి ఏడుస్తావ్ ఏంట్రా? పోనీ నీకు అదే ఆనందమా? ఓకే ఫైన్ వీడు ఒక మెంటల్ గాడు. వీడికి స్ట్రెస్ తగ్గింది అనుకుంటాను. పనీ పాటా లేకపోతే పని చూసుకో.

లైఫ్ లో మనం ఎవరైనా ఐడెంటిటీ కోసమే కష్టపడతాం. ఒక గుర్తింపు ఉండాలి అని. అది ఎలాగైనా ఉండచ్చు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్. నువ్వేమైనా వచ్చి మంథ్లీ బిల్స్ పే చేస్తున్నావా? మంథ్లీ రెంట్ కడుతున్నావా? లేదంటే ఎవరినైనా చూసుకుంటున్నావా? నిన్నే ఒకరు చూసుకుంటున్నారు అనుకుంట. అందుకే నీ ఆలోచన అక్కడికే ఉంది. అవతలి వాళ్ల మీద పడి ఏడ్చే అంత. ఫస్ట్ నువ్వు బాగు పడరా.. అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఏంటీ అని. ఇది అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా.. నీకే ఐడెంటీ లేదు. నీకే లైఫ్ లో ప్రోగ్రెస్ అవ్వాలని లేదు. వేరేవాళ్ల మీద పడి ఏడుస్తావ్ ఏంట్రా? ఏ జాబ్ కి అయినా ఐడెంటీ ఉంటుంది. సాఫ్ట్ వేర్ వాళ్లది ఒక స్టైల్, బిజినెస్ వాళ్లది ఒక స్టైల్, మీడియాలో ఉండే వాళ్లది ఒక స్టైల్.. ఎవరికి వాళ్లకి ఒక స్టైల్ ఉంది. నువ్వేం చేస్తున్నావ్ కూర్చుని? కామెంట్స్ చేస్తూ బతుకుతున్నవ్. అసలు తిండి ఎలా పుడుతుంది నీ కడుపుకి? తూ..” అరియానా ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మరి.. అరియానా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి