iDreamPost

Theatres Closed : సినిమాలకు మళ్ళీ గడ్డు రోజులు రానున్నాయా

Theatres Closed : సినిమాలకు మళ్ళీ గడ్డు రోజులు రానున్నాయా

ఇవాళ జరిగిన రెండు కీలక పరిణామాలు యావత్ భారతదేశపు సినీ పరిశ్రమను ఆందోళనలో నెట్టేస్తున్నాయి. అందులో మొదటిది ఢిల్లీలో థియేటర్ల సంపూర్ణ మూసివేత. అక్కడి ప్రభుత్వం ఇవాళే తాజాగా దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. ఓమిక్రాన్ వైరస్ కట్టడిలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పింది. సినిమా హాళ్లతో పాటు పబ్బులు. జిమ్ములు, ఆడిటోరియంలు వెంటనే క్లోజ్ చేయాలని ఆర్డర్లు జారీ చేసింది. ఇప్పటికే మహారాష్ట్రలో 50 శాతం ఆక్యుపెన్సీతో పాటు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే అనుసరిస్తున్నాయి. ఇప్పుడీ ఢిల్లీ చర్యతో ఇతర స్టేట్స్ కూడా ఇదే బాటలో ప్రయాణించే అవకాశం లేకపోలేదు.

ఇక రెండోది షాహిద్ కపూర్ జెర్సీ విడుదల వాయిదా. డిసెంబర్ 31కి ముందు చెప్పినట్టు కాకుండా నిరవధికంగా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మధ్యస్థ బడ్జెట్ లో రూపొందిన దీనికే ప్రొడ్యూసర్లు భయపడుతున్నారంటే ఇక ఆర్ఆర్ఆర్ ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. రాధే శ్యామ్ మేకర్స్ కూడా టెన్షన్ పడాల్సిన విషయమిది. ఒకవైపు రాజమౌళి ఇద్దరు హీరోలను వెంటేసుకుని కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ప్రమోషన్లు చేస్తున్నాడు. విడుదలకు కేవలం తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తమ నిర్ణయానికి కట్టుబడతారా లేక ఆగుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

నైట్ షోలు లేకపోవడం రెవిన్యూ పరంగా అంత కొట్టిపారేయాల్సిన అంశం కాదు. అందులోనూ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇవే చాలా కీలకం. అందుకే జెర్సీ యూనిట్ వెనుకడుగు వేసింది. భీమ్లా నాయక్ నిర్మించిన సితార ఎంటర్ టైన్మెంటే జెర్సి హిందీ రీమేక్ లో ప్రధాన భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అల్లు అరవింద్ మరో ఇద్దరు పార్ట్ నర్స్. త్వరలో రిలీజ్ కు ప్లాన్ చేసుకున్న హిందీ సినిమాలు అయితే ఇంకో రెండు నెలలు వెయిట్ చేయడం లేదా డైరెక్ట్ ఓటిటికి వెళ్లిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడిప్పుడే పరిశ్రమ కుదుటపడుతున్న టైంలో ఇలా జరగడం పట్ల నిర్మాతల సర్కిల్స్ లో చర్చలు మొదలయ్యాయి

Also Read : RRR : సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతున్న “RRR”

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి