iDreamPost

సూర్యుడి మీద స్పాట్, భూమికి రెండింత‌లు పెరిగింది… భూమివైపు చూస్తోంది.

సూర్యుడి మీద స్పాట్, భూమికి రెండింత‌లు పెరిగింది… భూమివైపు చూస్తోంది.

సూర్యుడి మీద‌ న‌ల్లటి మ‌చ్చ‌. రెండు భూమిలంత ప‌రిమాణం మేర పెరిగింది. అది భూమివైపు గురిపెట్టిన‌ట్లు క‌నిస్తోంద‌ని అంటే, మెలోడ్రామాగా, కాస్తంత భ‌యాన‌కంగా అనిపించొచ్చు. కాని, ఈ స‌న్ స్పాట్ వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశాల చాలా త‌క్కువ‌. భ‌య‌ప‌డాల్సిందేమీలేదు.

స‌న్ స్పాటులో ఈ విశ్వంలో న‌క్షిత్రాల‌కు స‌హ‌జ‌మైన విష‌యం. స‌న్ స్పాట్ అంటే ఏమీ లేదు. ఎల‌క్ట్రో మేగ్నెట్ కండీష‌న్. సైన్స్ ప‌రిభాష‌లో చెప్పాలంటే, సూర్య‌కేంద్రం నుంచి సూప‌ర్ హీట్ అయిన ప‌దార్ధాన్నిపైకి తీసుకువచ్చే ప్రసరణ ప్రక్రియలకు, అంతరాయం కలిగించే ఎల‌క్ట్రో మేగ్నెట్ కండీష‌న్ వ‌ల్,ల సూర్యుని ఉప‌రిత‌లంపై చీక‌టి మ‌చ్చ‌లు ఎర్ప‌డ‌తాయి. వాటినే స‌న్ స్పాట్ ల‌ని పిలుస్తారు. ప్ర‌తి న‌క్షిత్రంమీద ఎర్పడ‌తాయి. ఇవి స‌హ‌జం.

సన్‌స్పాట్‌లను సృష్టించే, విద్యుదయస్కాంత పరిస్థితులు త‌యారైన‌ప్పుడు, అవి ఒక స్థాయికి చేరి, విజృంభించి అంత‌రిక్షంలోకి కాంతివేగంతో విడుద‌ల అవుతాయి. అవే సోలార్ ఫ్లేర్స్. ఇవే, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (CMEs) అని పిలిచే భారీ స్థాయి రేడియేషన్ ను, సూర్యుని వేడిప‌దార్ధాన్ని అంతరిక్షంలోకి విడుదల చేస్తాయి.

సోలార్ ఫ్లేర్ భూమి ఎగువ వాతావరణాన్ని తాకితే, అది తీసుకొచ్చే ఎక్స్-కిరణాలు, అతినీలలోహిత కిర‌ణాలు, చాలా గ్యాస్ అణువులను అయనీకరణం చేస్తాయి. ఇది డైరెక్ట్ గా మ‌న‌పై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌దు కాని, అంత‌రిక్షంలో తిరిగే కమ్యూనికేషన్ ఉప‌గ్ర‌హాల‌ను మాత్రం దెబ్బ‌తీయొచ్చు.

రేడియో తరంగాలు ఎప్పుడూ సరళ రేఖలలో ప్రయాణిస్తాయి. మ‌రి భూమి గుండ్రంగా ఉంది. అంటే మ‌నం ఇండియా నుంచి రేడియో త‌రంగాల‌ను పంపితే అవి విశ్వంలోకి వెళ్లాలికాని, అవి ఎలాగ అమెరికాను చేరుతున్నాయి? ఇక్క‌డే వాతావరణంలోని పై పొరలు మ‌న‌కు సాయం చేస్తున్నాయి. అవి రేడియో తరంగాలను తిరిగి భూమి వైపు బౌన్స్ చేస్తాయి. దాని వ‌ల్లే వేల కిలోమీట‌ర్లు మేర‌కూడా సిగ్న‌ల్స్ పంపించ‌గ‌లుగుతున్నాం. ఇదంతా సోలార్ ఫ్లేర్స్ ప్ర‌భావంలేనంత‌వ‌ర‌కే. ఒక‌వేళ అయనీకరణం జ‌రిగితే తేడా కొడుతుంది. ఎగువ వాతావరణం రేడియో తరంగాలను బౌన్స్ చేయ‌దు. మీరు పంపించే సిగ్న‌ల్స్ అలాగే విశ్వంలోకి వెళ్లిపోతాయి. వాటినే రేడియో బ్లాక్‌అవుట్ అని అంటాం.

సౌర మంట‌లు కాంతివేగంతో ప్ర‌యాణిస్తాయి. సూర్యుని నుంచి భూమిని చేరుకోవడానికి 8 నిమ‌షాలు మాత్ర‌మే ప‌డుతుంది. ఒక‌వేళ మ‌నం క‌నిపెట్టినా ముందుజాగ్ర‌త్త‌లు తీసుకొనే స‌మ‌యంలేదు. అదృష్ట‌మేంటంటే, అవి కాస్త అంత‌రాయాన్ని క‌లిగిస్తాయి త‌ప్ప‌, ధ్వంసం చేయ‌వు. అదికూడా కొన్ని ప్రాంతాల్లోనే. ఎందుకంటే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి