iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లోకి రాబోయే సినిమాలు ఇవే.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

  • Published Apr 01, 2024 | 11:31 AM Updated Updated Apr 01, 2024 | 11:31 AM

This week OTT Releases: ఎప్పటిలానే మరో వారం ఓటీటీ లలో కొత్త సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అయ్యేందుకు.. సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం ఏ ఏ సినిమాలు, ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయో చూసేద్దాం.

This week OTT Releases: ఎప్పటిలానే మరో వారం ఓటీటీ లలో కొత్త సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అయ్యేందుకు.. సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం ఏ ఏ సినిమాలు, ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయో చూసేద్దాం.

  • Published Apr 01, 2024 | 11:31 AMUpdated Apr 01, 2024 | 11:31 AM
ఈ వారం OTT లోకి రాబోయే సినిమాలు ఇవే..  స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

ప్రతి శుక్రవారం ఎలా అయితే కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయో.. అలానే ప్రతి వారం పదుల సంఖ్యలో ఓటీటీలలో కొత్త సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తితో.. వచ్చే వారం ఓటీటీ లోకి ఎలాంటి సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటున్నారు. పైగా ఇక స్టూడెంట్స్ అందరికి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి.. ఇక నుంచి రిలీజ్ అవ్వబోయే సినిమాలకు, సిరీస్ లకు .. ఓటీటీ లలో ఆదరణ బాగా లభించేస్తుందని చెప్పడంలో.. ఎలాంటి సందేహం లేదు. మరి ఈ క్రమంలో ఏప్రిల్ 1నుండి ఏప్రిల్ 7వరకు ప్రైమ్ వీడియో, జీ5, సోనీలివ్, హాట్ స్టార్, సోనీలివ్, నెట్ ఫ్లిక్స్ లో ఏ ఏ సినిమాలు, ఏ ఏ తేదీలలో విడుదల కానున్నాయో చూసేద్దాం.

ఏప్రిల్ 1నుండి ఏప్రిల్ 7వరకు ఓటీటీలలో రానున్న సినిమాల జాబితా ఇలా ఉంది.

హాట్ స్టార్

1) లంబసింగి:
బిగ్ బాస్ ఫేమ్ దివి లీడ్ రోల్ లో నటించిన సినిమా “లంబసింగి”. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి నెల రోజుల లోపే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల ఏప్రిల్ 2 నుంచి ‘లంబసింగి’ సినిమా హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ సినిమా కథ ఒక లైన్ లో చెప్పాలంటే.. ఒక పోలీస్ కానిస్టేబుల్.. నక్సలైట్ కూతురిని ప్రేమించడం వెనుక సాగే కథ ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో దివి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

2) భీమా:
గోపిచంద్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘భీమా’ సినిమా .. మార్చి 8న థియేటర్ లో రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఊహించినంత రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయింది. దీనితో థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజుల లోపే ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తుంది. భీమా సినిమా ఏప్రిల్ 5 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

3) హనుమాన్:
ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. అటు థియేటర్ లోను, ఇటు ఓటీటీల లోను.. రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న సినిమా హనుమాన్. ఇప్పటికే రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. తెలుగు, హిందీ వెర్షన్స్ తో పాటు.. ఇకపై కన్నడ, తమిళ, మలయాళ వెర్షన్స్ కూడా ఏప్రిల్ 5నుంచి .. హాట్ స్టార్ లోకి రానున్నాయి.

జీ 5

4) ఫారీ :
ఒక స్కూల్ లో చీటింగ్ రాకెట్ చుట్టూ సాగే కథ ఫారి. గత ఏడాదే థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. ఎట్టకేలకు ఇప్పుడు జీ 5 ఓటీటీలో ఏప్రిల్ 5నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

నెట్ ఫ్లిక్స్

5) పారాసైట్ ద గ్రే :
దాదాపు ఇప్పుడు ఎక్కువగా అందరు కొరియన్ సిరీస్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కొరియన్ సిరీస్ లను ఇష్టపడే వారికీ పారసైట్:ది గ్రే సిరీస్ ఖచ్చింతంగా ఓ మంచి థ్రిల్లింగ్ ఎక్సపీరియెన్స్ ను ఇస్తుందని చెప్పొచ్చు. కే-డ్రామా ప్లాట్ లో కొనసాగే ఓ మంచి హర్రర్ సస్పెన్స్, లైవ్ యాక్షన్ థ్రిల్లర్ ఈ “పారసైట్- ది గ్రే” సిరీస్. ఈ సిరీస్ ఏప్రిల్ 5నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

సోనీలివ్

6) ఫ్యామిలీ ఆజ్ కల్:
ఒక ట్యాక్సీ డ్రైవర్ ను ప్రేమించే ఓ మధ్య తరగతి యువతి, ఆమె కుటుంబం చుట్టూ తిరిగే స్టోరీ.. “ఫ్యామిలీ ఆజ్ కల్”. ఈ సిరీస్ ఏప్రిల్ 3నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

మినీ టీవీ:

7) యే మేరే ఫ్యామిలీ 3:
ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్స్ ను పూర్తి చేసుకుని.. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మూడవ సీజన్ రాబోతుంది. ఈ సీజన్ ఏప్రిల్ 4నుంచి.. అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమింగ్ కానుంది.

మరి ఈ వారం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి రాబోయే సినిమా అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet giriş