iDreamPost

గ్రూప్-1 అభ్యర్థులకు APPSC గుడ్ న్యూస్! దరఖాస్తు గడువు పెంపు!

AP Group-1: గ్రూప్-1 కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. గత నెల 8న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే గ్రూప్-1 విషయంలో ఓ శుభవార్త చెప్పింది.

AP Group-1: గ్రూప్-1 కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. గత నెల 8న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే గ్రూప్-1 విషయంలో ఓ శుభవార్త చెప్పింది.

గ్రూప్-1 అభ్యర్థులకు APPSC గుడ్ న్యూస్! దరఖాస్తు గడువు పెంపు!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే స్టేట్ సివిల్ సర్వీసెస్ గా పేర్కొనే గ్రూప్-1కి నోటీఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ పోస్టుల భర్తికీ డిసెంబర్ 8వ తేదీన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తు గడువు జనవరి 21వ తేదీన ముగిసింది. ఈక్రమంలో పలువురు గడువుల తేదీని పెంచాలంటూ ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్-1 దరఖాస్తు చేయాలనుకునే వారికి ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది.  గ్రూప్-1కి దరఖాస్తు చేసుకునే గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనుంది. డిసెంబర్ నెలలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 పోస్టులకు జనవరి 1వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించింది.  ఈ దరఖాస్తులకు 21వ తేదీ వరకు స్వీకరించారు. ఈ క్రమంలోనే  గ్రూప్-1కి భారీగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అయితే చాలా మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ఏపీపీఎస్సీ ఇచ్చిన సమయంలోపు దరఖాస్తు చేయలేక పోయారు. దీంతో దరఖాస్తు గడువును పెంచాలని ఏపీపీఎస్సీని కోరారు. దీంతో  అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును పెంచుతూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులకు దరఖాస్తు గడువును మరో వారం పొడిగిస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 దరఖాస్తులను అభ్యర్థులు ఈ జనవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

ఇక గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి.. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్‌ విధానంలో ఈ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి డిస్క్రిప్టివ్‌ విధానంలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. అయితే మెయిన్స్ పరీక్ష తేదీని  ఏపీపీఎస్సీ ఇంకా ఖరారు చేయలేదు. మొత్తం 81 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మరి.. గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి