iDreamPost

ప్రభుత్వం పై మరో ఫిర్యాదు – చంద్రబాబు పావులు కదుపుతున్నారా ?

ప్రభుత్వం పై మరో ఫిర్యాదు – చంద్రబాబు పావులు కదుపుతున్నారా ?

రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ నిమ్మగడ్డ లేఖ వ్యవహారం ఇంకా చల్లబడకుండానే ప్రభుత్వం పై ఫిర్యాధు చేస్తు మరో అధికారి గవర్నర్ ను కలిసారని ఆంధ్రజ్యోతి పత్రిక లో ఒక కధనం ప్రచురితం అయింది . ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ కధనం ప్రకారం, ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ శుక్రవారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారని గత ఏడాది నవంబర్ నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరిస్తూ మూడుపేజీల లేఖను గవర్నర్ కి సమర్పించినట్టు ప్రచురించింది. ఆ లేఖలో చైర్మన్‌ ఉండగానే ఎలాంటి సమాచారం లేకుండానే రంగరాజన్‌ను ఇన్‌చార్జి చైర్మన్‌గా నియమించారని, ఏపీపీఎస్సీలో చైర్మన్‌కు కనీసం పేషీ లేకుండా తీసేశారని, చైర్మన్‌ పేషీలో పీఏ ఉండాలి కానీ, అప్పటి వరకు ఉన్న పీఏని తొలగించారని, పర్సనల్‌ అటెండర్‌ను సైతం లేకుండా చేశారని, చైర్మన్‌తో ప్రమేయం లేకుండానే అన్ని బాధ్యతలను సెక్రెటరీనే నిర్వహిస్తున్నారని, ఏపీ ప్రభుత్వం తనను అవమానిస్తోందని ఉదయభాస్కర్‌ పేర్కొన్నారు.

పిన్నమనేని ఉదయ బాస్కర్ వ్యవహార శైలి పై మొదటి నుండి ఆరొపణలే:-

గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన పిన్నమనేని ఉదయ భాస్కర్‌ చంద్రబాబు హయాములో 2015 నవంబర్ 26న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. జేఎన్‌టీయూ కాకినాడలో డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్‌ గా, యూసీఈకే, యూసీఈవీ క్యాంపస్‌ కళాశాలలకు ప్రిన్సిపాల్‌గా, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి అధిపతిగాను చేసిన ఉదయ భాస్కర్ వ్యవహారశైలి ఆది నుండి వివాదాస్పదమే, నాడు తెలుగుదేశం ముఖ్యనేతల్లో ఒకరైన సుజనా చౌదరి ప్రోద్బలంతో ఏపిపిఎస్సీ చైర్మన్ పదవి దక్కించుకున్న ఉదయ బాస్కర్ తోలి రోజు నుంచే వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటు లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్ తో ఆడుకున్నారనే అపవాదు ఉంది.

చైర్మన్ హోదాలో కనీసం మిగిలిన సభ్యులతో సంప్రదింపులు జరపకుండా గ్రూప్ 1,2,3 లకు సంభందించిన సిలబస్ ను అనేక సార్లు మార్పు చేశారని, హైద్రబాద్లో ఉన్న కోచింగ్ సెంటర్లతో ఒప్పందం చేసుకుని దానికి అనుగుణంగా గ్రూప్ 1,2,3 పరీక్షలు నిర్వహించారని. పరీక్షల ప్రశ్న పత్రాలు తయారీలో కూడా ప్రొఫెసర్ల ప్యానల్లకు బదులుగా కోచింగ్ సెంటర్ల యజమానులతో చర్చలు జరిపేవారని విద్యార్ధి సంఘాలు ఆనాడే పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. నెగెటివ్ మార్కుల విధాన నిర్ణయంలో కూడా బోర్డు సభ్యులతో చర్చించకుండా, కోచింగ్ సెంటర్ల యజమానుల సలహానే తీసుకున్నారని దీంతో గ్రామీణ విద్యార్దులు తీవ్రంగా నష్టపోయారని నిరుద్యోగులు వాపోయారు. ఉదయ భాస్కర్‌ సూచించిన కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్న విద్యార్ధులకు సిలబస్ తో పాటు పరీక్షా ఇంటర్వ్యు విధానాన్ని ముందే చెప్పి లక్షలు వసూలు చేశారని, ఉదయబాస్కర్ నిర్ణయాలతో తమ భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారిందని నిరుద్యోగులు తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాల్లో పోస్టర్లు సైతం అంటించారు . ఉదయ బాస్కర్ తో పాటు స్కాంలో ఉన్న వారందరిని అదుపులోకి తీసుకుని విచారించి నిజనిజాలు బయట పెట్టాలని విద్యార్ది సంఘాలు ఆది నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.

జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఈయన ఆలోచనా దోరణిలో మార్పులు రాలేదనే చేబుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని సియం జగన్ ఆలోచనలకు అడ్డు పడేలా వ్యవహరించారని, చంద్రబాబు హయాంలో పదవి చేపట్టిన ఉదయ బాస్కర్ ప్రభుత్వం మారినా నామినేటెడ్ పదవికి రాజీనామా చెయకుండా ప్రభుత్వంలోనే ఉంటూ చంద్రబాబుకు లబ్ది చేకూర్చేలా వ్యవహరిస్తు వచ్చేవారని, వై.యస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఎంతో ప్రతిష్త్మకంగా నిర్వహించిన గ్రామ వార్డు సెక్రటేరియట్ పరిక్షా పత్రాలు ఏ.పి.పి.ఎస్.స్సీ డిపార్ట్మెంట్ నుండి లీకైనాయని చంద్రబాబు చేసిన ఆరోపణలను ఉద్దేశ పుర్వకంగానే ఖండించడంలో ఆలసత్వం చూపి ప్రభుత్వం పై ప్రతిపక్షాలు మరింత బురద జల్లే ఆస్కారం కల్పించారని. ఈ వ్యవహార శైలితో పూర్తిగా విసిగిపోయిన ప్రభుత్వం గడిచిన డిసెంబర్ లోనే ఉదయ బాస్కర్ ను తొలగించాలని గవర్నర్ హరిచందన్ కు ఫిర్యాదు చెసింది.

రాష్ట్ర ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా ఈదాడి జరుగుతునట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట , వ్యవస్తలను మ్యానేజ్ చేయగల సత్తా ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తుందనే అనుమానాలు వై.యస్.ఆర్ కాంగ్రెస్ శ్రేణులనుండి వినిపిస్తోంది. పరిపాలనలో అడుగడుగునా అడ్డు తగిలేలా చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న కొంత మంది తన మనుషుల ద్వారా ఈ లేఖల డ్రామాకి తెరలేపారని , ఒంటెద్దు పోకడతో విద్యార్ధుల జీవితాలతో చలగాటం ఆడిన ఉదయ బాస్కర్ చేత ప్రభుత్వం పై మచ్చవేయాలనే ప్రయత్నం చెస్తే చూస్తు ఊరుకునే ప్రసక్తే లేదని వై.య.ఆర్ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర ప్రభుత్వం పై ఏదో ఒక మూల నుండి అస్తిరపరచాలనే ఆలోచనతో కుట్రలు జరుగుతూనే ఉన్నాయని భావన ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉంటు అదును చూసి ప్రభుత్వానికి అడుగడుగున అడ్డు పడుతిన్న వారిని గుర్తించి వారికి తక్షణం ఉద్వాసన పలకవలసిన అవసరం ప్రభుత్వం పై ఎంతైనా ఉందనే మాట వినిపిస్తుంది. ప్రభుత్వం ఈ మేరకు ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి