iDreamPost

మత్తు డాక్టర్‌ సుధాకర్‌ ఘటనపై సీబీఐ విచారణ.. హైకోర్టు సంచలన నిర్ణయం

మత్తు డాక్టర్‌ సుధాకర్‌ ఘటనపై సీబీఐ విచారణ.. హైకోర్టు సంచలన నిర్ణయం

విశాఖలోని పోర్టు ప్రభుత్వ ఆస్పత్రిలోని మత్తు డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సుధాకర్‌ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. సుధాకర్‌ ఘటనలో పోలీసులు ఇచ్చిన నివేదికకు, సుధాకర్‌ ఇచ్చిన వాగ్మూలానికి మధ్య వ్యత్యాసం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. సుధాకర్‌ శరీరంపై గాయాలు ఉన్నాయని పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి అనుమానంగా ఉండడంతో సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది. 8 వారాలు లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని తన ఆదేశాల్లో పేర్కొంది.

ప్రభుత్వంపై విమర్శలు చేసి సస్పెండ్‌కు గురైన సుధాకర్‌ ఇటీవల మద్యం సేవించి ప్రధాని, సీఎంలను దూషించడం, మతిస్థిమితం లేని వాడిగా ప్రవర్తించడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత హైకోర్టుకు లేఖ రాశారు. ఆ ఘటనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు జత చేశారు. ఈ లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు జారీ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి