iDreamPost

మరో జీవోను సస్పెండ్‌ చేసిన ఏపీ హైకోర్టు

మరో జీవోను సస్పెండ్‌ చేసిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ జారీ చేసిన మరో జీవోను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో జీవో జారీ చేసింది. ఇప్పటి వరకూ ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో గరీష్టంగా 720 మంది విద్యార్థులు అడ్మిషన్‌ పొందేవారు. అయితే చాలా కాలేజీల్లో సరైన తరగతి గదులు, మౌలిక సదుపాయలు లేమితో విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందడంలేదన్న నివేదిక అధారంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్మిషన్ల సంఖ్యను కుదించింది. ఒక కాలేజీలో 9 సెక్షన్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సెక్షన్‌కు 40 చొప్పన 360 మందిని మాత్రమే చేర్చుకునేలా జీవో 23ను జారీ చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసాయి. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇంటర్‌మీడియట్‌ బోర్డు అధికారులు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మంగళవారం బోర్డు అధికారులు విచారణకు హాజరయ్యారు. కొన్ని ప్రైవేటు కాలేజీలు నిబంధనలు పాటించడంలేదని, తద్వారా విద్యార్థులకు నష్టం వాటిళ్లుతోందని వివరించారు. వారి వివరణను నోట్‌ చేసుకున్న ధర్మాసనం ఈ రోజు జీవోను సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి