iDreamPost

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం-ఉద్యోగ నియామక పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం-ఉద్యోగ నియామక పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఉద్యోగాల నియామకాల ప్రక్రియను సిద్ధం చేసింది. కరోనా కారణం ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఏపీపీఎస్సి నిర్వహించాల్సిన అనేక ఉద్యోగ నియామక పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. తాజాగా పరీక్షల తేదీల వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది.

సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 13 వరకూ వివిధ తేదీలలో ఏపీపీఎస్సి ప్రకటించిన ఉద్యోగ నియామక పరీక్షలు జరగనున్నాయి.

ఏపీపీఎస్సి విడుదల చేసిన పరీక్షల తేదీల వివరాలు:

సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామక పరీక్షలు

సెప్టెంబర్‌ 21, 22, 23, 24 తేదీల్లో గెజిటెడ్‌ ఉద్యోగాల నియామక పరీక్షలు

సెప్టెంబర్‌ 21, 22 అసిస్టెంట్‌ బీసీ / సోషల్‌ / ట్రైబల్‌ వేల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగ నియామక పరీక్షలు

సెప్టెంబర్‌ 22న రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ మైనింగ్‌ సర్వీస్‌ ఉద్యోగ నియామక పరీక్ష

సెప్టెంబర్‌ 23న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాల నియామక పరీక్ష

సెప్టెంబర్‌ 23న పోలీసు విభాగంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల నియామక పరీక్ష

సెప్టెంబర్‌ 23, 24 పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి పరీక్ష

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి