iDreamPost

జాతీయ స్థాయిలో ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు అగ్రస్థానం!

జాతీయ స్థాయిలో  ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు అగ్రస్థానం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యావ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే దగ్గర నుంచి.. విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు. నాడు-నేడు ద్వారా సర్కార్ బడుల రూపు రేఖలనే సీఎం జగన్ మార్చేశారు. అలానే అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన వంటి పథకాల ద్వారా విద్యార్థల చదువులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారు. అలానే ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియాని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టారు.  అయితే ఏపీ విద్యా వ్యవస్థపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేశాయి. అయితే తాజాగా జాతీయ స్థాయిలో ఏపీ విద్యావ్యవస్థకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

ఏపీ విద్యావ్యవస్థపై ప్రతిపక్ష పార్టీలు అనేక రకాల విమర్శలు  చేస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం ద్వారా విద్యార్థులు ఇబ్బంది పడతారని, మాతృభాషకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, అలానే విద్యా వ్యవస్థలో ప్రభుత్వం చేసిన వివిధ మార్పులు విద్యార్థులు నష్టాని కలిగిస్తాయంటూ విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా జాతీయ స్థాయిలో ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ప్రత్యేక గుర్తింపు లభించింది. దీని ద్వారా ఏపీ విద్యా వ్యవస్థను విమర్శించే వారికి గుణ పాఠమని కొందరు అభిప్రాయ పడుతున్నారు. జాతీయ స్థాయిలో ఏపీ విద్యా వ్యవస్థకు అగ్రస్థానం దక్కింది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను అన్ని రాష్ట్రాల విద్యావ్యవస్థ పనితీరుపై గ్రేడింగ్ ఇండెక్స్ ను కేంద్ర ప్రభుత్వం విడుద చేసింది.

ఈ ఇండెక్స్ లో ఏపీకి ప్రథమ స్థానం దక్కింది. 73 అంశాలకు 1000 పాయింట్ల ఆధారంగా కేంద్రం గ్రేడింగ్ ఇచ్చింది. దీంతో 902 పాయింట్లతో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. లెర్నింగ్ ఔట్ కమ్, యాక్సెస్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్, గవర్నెన్స్ ప్రాసెస్, టీచర్స్ ఎడ్యూకెషన్ అండ్ ట్రైనింగ్ అనే ఆరు అంశాల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చారు. మరి.. కేంద్ర విడుల చేసిన గ్రేడింగ్ ఇండెక్స్ లో ఏపీకి తొలి స్థానం దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి