iDreamPost

రేపటి నుంచి ఏపీలో విద్యార్థులకు కోటి పాఠ్యపుస్తకాల పంపిణీ!

రేపటి నుంచి ఏపీలో విద్యార్థులకు కోటి పాఠ్యపుస్తకాల పంపిణీ!

విద్యార్థులకి చదువు, బడికి వెళ్లడం ఎంత ముఖ్యమో.. చదువుకోడానికి పుస్తకాలు కూడా అంతే ముఖ్యం. చదువుకోడానికి పుస్తకాలు లేకుండా దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు బాధపడుతున్నారు. అయితే, ఏపీలో మాత్రం ఈ ఇబ్బందులు ఉండటం లేదు. సమయానికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందుతున్నాయి. ఇక, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే  విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అతి త్వరలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయనుంది.

ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి చదువుతున్న 35 లక్షల మంది విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కోటి పుస్తకాలు పంపిణీ చేయబోతోంది. 1000 పాఠశాలకు ఈ పుస్తకాలను అందించబోతోంది. 22 జులై, శనివారం నుంచి ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. గత సంవత్సరం చోటుచేసుకున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సారి స్కూళ్లు మొదలుకాక ముందే విద్యార్థులకు పుస్తకాలు అందేలా అధికారులు ప్లాన్‌ చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైన్స్, సోషల్, మాథ్స్ పుస్తకాలను ఒకటో సెమిస్టర్, రెండో సెమిస్టర్‌కు విడివిడిగా ప్రింట్ చేయించింది.

అంతేకాదు! పుస్తకాలకు ఒక దిక్కు తెలుగు ఇంకో దిక్కు ఇంగ్లీష్ ఉండనుంది. విద్యార్థులకు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్‌కు మారడానికి సులభంగా ఉంటుందని ఇలా చేస్తోంది. రెండవ సెమిస్టర్ నవంబర్ ఒకటో తేదీ నుంచి మొదలు అవుతున్నప్పటికీ, ఆ పుస్తకాలు కూడా ఇపుడే విద్యార్థులకి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పుస్తకాల పంపిణి కోసం ప్రభుత్వం అమెజాన్ ట్రాన్స్‌పోర్ట్‌ను వాడుతోంది. శనివారం ఈ పుస్తకాలను విద్యాకానుక కిట్స్‌తో పాటు అందించనుంది. మరి, విద్యార్థులకు కోటి పుస్తకాల పంపిణీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి