iDreamPost

సెల్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ కోసం కొత్త ఏర్పాట్లు

సెల్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ కోసం కొత్త ఏర్పాట్లు

ఏపీ ప్రభుత్వం మరో విన్నూత్న ప్రయోగం చేస్తోంది. ముఖ్యంగా మన్యం వాసుల సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. అందుకు అనుగుణంగానే కమ్యూనికేషన్ మెరుగు పరిచే పనిలో పడింది. మారుమూల ఏజెన్సీలో సైతం సమాచార వ్యవస్థ పటిష్ఠ పరిచే యత్నం చేస్తోంది. అందులో భాగంగా గ్రామ వాలంటీర్ల కి ఐసాట్ ఫోన్లు పంపిణీ చేసింది. తద్వారా గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి జరుగుతుందని ఆశిస్తోంది.

నేటికీ అనేక ఏజెన్సీ గ్రామాలకు సమాచార వ్యవస్థ నామమాత్రంగా ఉంది. అలాంటి గ్రామాల్లో పని చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ మైదాన ప్రాంతాలకు భిన్నంగా ఉంది. దాంతో ఈ వైరుధ్యం సరిదిద్దే చర్యలకు ఏపీ ప్రభుత్వం పూనుకుంది. వాలంటీర్ల కి ఐసాట్ ఫోన్లు అందించారు. సిమ్ కూడా పంపిణీ చేశారు. సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, కేఆర్ పురం,శ్రీశైలం ఐటిడిఎ పరిధిలో 203 ఫోన్లు అందించారు. ఇవి సెల్ టవర్ లేకపోయినా మొబైల్ ఫోన్లు మాదిరిగా పని చెస్తాయి.

మావోయిస్టులు ఏరివేత లో భాగంగా కుంబింగ్ అపరేషన్స్ లో పాల్గొనే వర్గాలు ఎక్కువగా వీటిని వాడుతూ ఉంటారు. ఇప్పుడు సాధారణ వాలంటీర్ చేతుల్లోకి కూడా వచ్చిన తరుణంలో అత్యవసర వేళ ఎంతో ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. 108 వాహనాలు వంటివి వెంటనే ఆయా గ్రామాలకు వెళ్లేందుకు ఇవి ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుత సమాచార విప్లవ యుగంలో మన్యం వాసుల జీవన విధానం మెరుగుదలకు ఇది దోహదపడే అవకాశం ఉంది.
Aa

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి