iDreamPost

డెయిరీ రంగంలో కొత్త ఆశలు- ఆమూల్ తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం

డెయిరీ రంగంలో కొత్త ఆశలు- ఆమూల్ తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం

గతంలో సొంత డెయిరీ కోసం పలు సహకార డెయిరీలను చితికిపోయేలా చేసిన ఘనత చంద్రబాబుదనే అభిప్రాయం ఉంది. చిత్తూరు జిల్లాలో పలు డెయిరీలు మూతపడడం వెనుక ఆయన పాత్రపై ఆరోపణలున్నాయి. చివరకు అన్ని డెయిరీల పరిస్థితి ఎలా ఉన్నా, ఏటా హెరిటేజ్ లాభాలు గడించడంలో చంద్రబాబు ప్రభుత్వ తోడ్పాటు బాహాటంగా బయటపడింది. చివరకు ఇటీవల హెరిటేజ్ నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉత్పత్తులపై దర్యాప్తునకు కూడా సిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా ప్రస్తుతం జగన్ సర్కారు డెయిరీల పునుద్దరణపై దృష్టి పెట్టింది. ఒకటి రెండు డెయిరీలు మాత్రమే కాకుండా పాల ఉత్పత్తిదారులంతా ప్రయోజనం పొందేలా ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా ఆమూలు సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకోవడం విశేషం.

పాడిపరిశ్రాభివృద్దిపై దృష్టి సారించిన జగన్ తాజాగా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే ‘అమూల్‌’తో వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చ సాగింది. పశువులకు మంచి వైద్యం, సంరక్షణ నుంచి… ఉత్తమ సాంకేతికత, పాల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ దిశగా అడుగులు వేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని భావిస్తున్నారు. సహకార రంగం బలోపేతం చేసి, పాడి రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యంగా ఈ ఒప్పందం ఉంటుందని తెలిపారు. జులై 15 లోగా అమూల్‌తో అవగాహన ఒప్పందం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అమూల్‌తో భాగస్వామ్యం ఎలా ఉండాలన్నదానిపై విధివిధానాలు ఖరారుచేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో పాడిపరిశ్రమకు మహర్దశ తీసుకురావడమే లక్ష్యంతో అమూలు తో ఒప్పందం తొలి అడుగు అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. పాడిపరిశ్రమల అభివృద్ధి చెందేలా, రైతులకు అదనపు ఆదాయాల రూపంలో మేలు చేకూరేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతిష్టాత్మక సహకార కంపెనీ ‘అమూల్‌’తో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. తద్వారా ఆ కంపెనీ అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, విస్తృతమైన మార్కెటింగ్‌ను వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలో సహకారార రంగాన్ని బలోపేతంచేయడంతోపాటు, రైతులకు మంచి ధర వచ్చేలా చూసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. జులై 15 లోగా ఈమేరకు ‘అమూల్‌’తో అవగానా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించారు.

రాష్ట్రలో పాడిపరిశ్రమ అభివృద్ధి, కష్టానికి తగ్గ ప్రతిఫలం పాల ఉత్పత్తిదారులకు లభించేలా, నాణ్యమైన పాల ఉత్పత్తులు జరిగేలా, వాటిద్వారా రైతులకు సరైన ధర వచ్చేలా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు తయారుచేసిన ప్రతిపాదనలను, తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అమూల్‌తో జరిపిన చర్చలు, రాష్ట్రంలో పాడిపరిశ్రమలపై ఆ కంపెనీ వెల్లడించిన విషయాలనూ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాడి రైతులు మేలు జరగాలని, వారు ఉత్పత్తిచేస్తున్న పాలకు మంచి రేటు రావాలని స్పష్టంచేశారు. ధర విషయంలో రైతులకు న్యాయం జరిగే పరిస్థితి ఉండకూదనన్నారు. రైతులకు అదనపు ఆదాయాలు ఇవ్వాలి, మరోవైపు సహకార రంగం బలోపేతం కావాలన్నారు. పాడిపరిశ్రమలో అమూల్‌కున్న అనుభవం రాష్ట్రంలో రైతులకు ఉపయోగపడాలని, పాడిపశువులకు వైద్యం, సంరక్షణ, నాణ్యమైన పాల ఉత్పత్తి, తద్వారా రైతులకు మంచి రేటు… ఇలా అన్ని అంశాల్లోనూ పాడిపరిశ్రమరంగం పటిష్టంకావాలన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా ఏపీ పాడి రైతులకు పలు ప్రయోజనాలు దక్కుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి