iDreamPost

అక్క చెల్లెల ముఖంపై చిరునవ్వు నిలిచేలా..

అక్క చెల్లెల ముఖంపై చిరునవ్వు నిలిచేలా..

ఇంటి మగ దిక్కులు మద్యం మహమ్మారి బారిన పడి జేబుతో పాటు శరీరాన్ని కూడా గుల్ల చేసుకుంటుంటే కన్నీరు కార్చని అక్కాచెల్లెళ్లకు కొదవేలేదు రాష్ట్రంలో. కానీ ఇది త్వరలోనే గతం కానుంది. ఆ అక్క చెల్లెల ముఖంపై చిరునవ్వు నిలిచే రోజులు త్వరలోనే మన ముందుకు రానున్నాయి. దశల వారి మధ్య నిషేధం దిశగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేగంగా చర్యలు ప్రారంభించారు.

తాను చెప్పిన మాటకు ఎట్టి పరిస్థితుల్లోనూ మారుమాటలు ఉండవని మరోమారు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మద్యం షాపులను తగ్గించడం లో భాగంగా జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల మేరకు దాదాపు 33 శాతం మద్యం షాపులు మూతపడడనున్నట్లు ఎక్సైజ్ వారి లెక్కలను బట్టి తేలుతోంది. అంతే కాకుండా ముందు కొనాలన్న ఆలోచన రాకుండా వాటి రేట్లను భారీగా పెంచుతూ మందుబాబుల స్వచ్ఛందంగా దూరమయ్యే విధంగా వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నారు.

రెండో విడత లాక్ డౌన్ ముగిసిన వేళ మే 4 నుంచి అన్నిటితో పాటు మద్యం షాపులు తెరుసుకోవచ్చని కేంద్రం ఇచ్చిన అనుమతి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ మద్యం షాపుల షెట్టర్లు పైకి లేచాయి. అయితే అదేదో మహా అపచారం జరిగినట్లు యధాశక్తిగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు గోల ప్రారంభించాయి. కానీ షాపులు తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటనతో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇప్పుడవి దిక్కులు చూస్తున్నాయి.

స్వింగ్ లో ఉన్నోడు చేతిలో సూది కూడా పాశుపతాస్త్రం అయిపోతుంది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల మద్దతు అనే బ్రహ్మాస్త్రమే సీఎం జగన్ చేతిలో ఉంది. దీంతో రాష్ట్రం బాగు కోసం, ప్రజల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో తీసుకునే నిర్ణయాలకు తిరుగు ఉండదనేది స్పష్టం. జీవన ప్రమాణం లో తమను ఒక మెట్టు పైకి తీసుకువచ్చే నాయకుడి కోసం రాష్ట్రంలోని దాదాపు 90 శాతం ప్రజలు ఎదురు చూశారు.

వారి ఎదురు చూపులకు ఫలితంగా జగన్ ఆగమనం జరిగింది. ఇక ఆ వరాలు ప్రజల ముందుకు ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. విద్య, వైద్యం, ప్రజాసంక్షేమం, రైతు సంక్షేమం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు.. ఇలా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కి చేపట్టాల్సిన చర్యలు ఒక్కొక్కటిగా పట్టాలపైకి వచ్చి చేరుతున్నాయి. వీటి ద్వారా జీవన ప్రమాణాలు పెంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి