iDreamPost

APలోని వాహనదారులకు ఊరట.. ఇక నుంచి ఆ ఛార్జీలు ఉండవు!

APలోని వాహనదారులకు ఊరట.. ఇక నుంచి ఆ ఛార్జీలు ఉండవు!

ప్రతి ఒక్క వాహనదారుడికి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డు అనేది ముఖ్యమైనవి. ఎప్పుడైన ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేసినప్పడు ప్రధానంగా అడిగేది.. వీటినే. అయితే ఇప్పటి వరకు వీటిని పేపర్ విధానంలో జారీ చేసేవారు. అలానే వీటిని పొందేందుకు డబ్బులు చెల్లించాల్సి అవసరం వచ్చేది. ఈ క్రమంలోనే వాహనదారులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డిజిటల్ లైసెన్స్, ఆర్సీ కార్డులను జారీ చేయనుంది. ఈ విధానం వల్ల వాహనదారులకు డబ్బులు ఆదా అవుతాయి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వాహనదారులకు ఊరట అనే చెప్పవచ్చు.

సాధారణంగా చాలా మంది వాహనంపై బయటకు వెళ్లే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ను ఇంట్లోనే మర్చిపోతారు. ఇలాంటి సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పడు జరిమానాలు కడుతూ ఉంటారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ విధానం వలన అలాంటి సమస్యకు చెక్ పెట్టవచ్చు. డిజిటల్ విధానంతో డ్రైవింగ్ లైసెన్స్‌ల మరిచిపోయామనే ఆలోచనే ఉండదు. ట్రాఫిక్ పోలీసులు అడిగినప్పుడు మీ ఫోన్‌ ద్వారా సులువుగా చూపించవచ్చు.

అయితే  వాహనాదారుడు అప్లయ్ చేసుకున్న తర్వాత పరిశీలన చేపట్టి.. ఈ డిజిటల్ కార్డు జారీ చేస్తారు. దీనిని డీజీ లాకర్, ఎం-పరివాహన్ ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచుతారు. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి లాగినై.. మీ డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాక అససరం అనుకుంటే వాటిని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. పోలీసులు వాహనం ఆపినప్పుడు డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్ కార్డులను చూపించవచ్చు. ఇక నుంచి పేపర్ విధానంలో కార్డులను రవాణాశాఖ జారీ చేయదు.

వాహనాలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది. ఇప్పటి వరకు పేపర్ విధానంలో జారీ చేస్తున్న డ్రైవింగ్ లైసెన్స్ కార్డుకు రూ.200, పోస్టల్ ఛార్జీ రూ.35 వరకు చెల్లించాల్సి వస్తుంది. డిజిటల్ విధానంలో కార్డు జారీ చేయడం వల్ల ఆ ఛార్జీలను ఇక నుంచి రవాణాశాఖ అధికారులు వసూలు చేయరు. ఇది వాహనదారులకు ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు. శుక్రవారం నుంచి ఈ డిజిటల్ విధానం అమల్లోకి రానుంది. మరి.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: జగన్ సర్కారు గుడ్ న్యూస్.. ఇక వారంతా పర్మినెంట్ ఉద్యోగులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి