iDreamPost

కౌలు రైతులకు సీఎం జగన్‌ ప్రభుత్వం శుభవార్త!

కౌలు రైతులకు సీఎం జగన్‌ ప్రభుత్వం శుభవార్త!

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏపీ కౌలు రైతులకు శుభవార్త చెప్పింది. కౌలు రైతుల పంటసాగుదారు హక్కు కార్డుల జారీ, పరిశీలనకు సంబంధించిన ప్రక్రియను ఆగస్టు 17 లోపు పూర్తి చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైతు భరోసా పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం హరికిరణ్‌ జిల్లాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ.. ‘‘ సెప్టెంబర్‌ 15 నాటికి ఈ క్రాప్‌ పూర్తి చేయాలి. యంత్రసేన యాప్‌లో బుకింగ్‌ వివరాలతో పాటు సీహెచ్‌సీ సంఘాలు తీసుకున్న అప్పు వివరాలను నమోదు చేయాలి’’ అని ఆదేశించారు. కాగా, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్‌ రైతులకు శుభవార్త చెప్పారు. వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని చెప్పారు. అదికూడా నెలాఖరులోపే వారికి సాయం చేస్తామని అన్నారు.

పంట నష్టాన్ని వీలైనంత త్వరగా అంచనా వేసి.. ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ వివరాలను ఆర్భీకేల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం అందుబాటులో ఉంచుతామన్నారు. భూమి కోతకు గురికాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. దాదాపు మూడున్నర కిలోమీటర్ల మేర సేఫ్టీవాల్‌ను కడతామని చెప్పారు. కాగా, వరదల్లో ఇళ్లు ధ్వంసం అయిన కుటుంబాలకు ఏపీ ‍ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. అంతేకాదు! నిత్యవసరాలను కూడా సరఫరా చేస్తోంది.  ఇక, వరద నీరు ఇంట్లోకి వచ్చిన వారికి కూడా ప్రభుత్వం రెండు వేల రూపాయల సాయం చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి