iDreamPost

గుడ్ న్యూస్.. తక్కువ ధరకే టమాటా..కిలో ఎంతంటే..?

గుడ్ న్యూస్.. తక్కువ  ధరకే టమాటా..కిలో ఎంతంటే..?

ఈ మధ్యకాలంలో నిత్యవసర  ధరలు ఆకాశం వైపు పరుగులు  తీస్తున్నాయి. ఇప్పటి వరకు పెట్రోలు, గ్యాస్ ధరలే సామాన్యుడికి చుక్కులు చూపిస్తుంటే… మేమున్నాము అంటూ కూరగాయలు కూడా వచ్చి చేరాయి. వీటి ధర చూస్తే ఎండల వేడి..కంటే ఎక్కువగా మండుతున్నాయి. ముఖ్యంగా టమాటా అయితే సామాన్యులకు అందనంత ఎత్తులో వెళ్లి కూర్చుంది. టమాట సెంచరీ కొట్టిందే కాకుండా ఇంకా దూసుకెళ్తుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు అర్థం చేసకున్న జగన్ సర్కార్ అధిక ధరలు నుంచి ఉపశమనం కలిగించేందుకు రెడీ అయ్యింది. అందుకే ప్రజకు ఓ మంచి శుభవార్తను అందించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

టామాటాలు అనేది ప్రతి కూరలో ఉపయోగించాల్సిందే.  అది వేస్తేనే వంట కమ్మగా ఉంటుంది. లేకపోతే.. ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది. సరే టమాటలు వేద్దామంటే.. కొండపై ఎక్కి కూర్చోని కిందకి దిగనుంటూంది. ధరల పందెం పెడితే.. పెట్రోల్, డిజీల్ వంటి వాటిని వెనక్కి నెట్టి మరీ ముందుకు వెళ్తుంది. తగ్గేదే లే అన్నట్లు ఎక్కడా కూడా రేస్ లో వెనక్కి తగ్గడం లేదు. ఎంత బతిమాలినా..బుజ్జగించినా..మాట వినట్లేదు. పైగా రోజురోజుకూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. రూ.100 కొడితేనే.. మీ ఇంటికి వస్తాని టమాట బెట్టు  చేస్తోంది. ఇది కేవలం రైతు మార్కెట్లో ధరేనండి. ఇక బయటైతే నన్ను అస్సలు తలుచుకోవద్దనట్లు టమాట ధర ఉంది.

ఈ డిమాండ్‌ తట్టుకోలేక..ఏపీ ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీపై టమాటా అందించాలని నిర్ణయించింది. టమాటాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి  రైతుబజార్లలో సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది. రైతు బజార్లో కేజీ రూ.50కే అందుబాటులో ఉంచుతోంది. కురాగాయల్లో కేవలం టమాట ధరే కాదండోయే… పచ్చి మిరపకాయలు, అల్లం, ఇతర అన్ని కూరగాయాలు కూడా టమాట దారిలో పయనిస్తున్నాయి. కొన్ని కూరగాయాల ధరలు అయితే టమాటను ఎక్కిరిస్తున్నాయంట. ఏపీ ప్రభుత్వం పుణ్యమా అని సబ్సిడీతో దొరుకుతోందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి