iDreamPost

మహమ్మారికి మూకుతాడు.. సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

మహమ్మారికి మూకుతాడు.. సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

ఊహకందని విధంగా కోవిడ్ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య 3.5 లక్షలు దాటుతోంది. మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కొరతతో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

కోవిడ్ కి మూకుతాడు వేసేందుకు జగన్ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిరోజూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ, కోవిడ్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కోవిడ్ సెంటర్లుగా మార్చేశారు. ఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్ కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు.

40 పడకల ఆస్పత్రులు .. కోవిడ్ సెంటర్లు..!

కేసుల ఉధృతి నేపథ్యంలో సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వైద్య సేవల కోసం 40 పడకలున్న ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్ హాస్పిటల్స్ గా మార్చనున్నారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు 12 వేల రెమిడెసివర్ ఇంజక్షన్లు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజా నిర్ణయం ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్ ను ఆరోగ్య శ్రీ కింద చేర్చి ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది ప్రభుత్వం. ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్ సెంటర్లుగా మార్చడంతో మరింత వేగంగా రోగులకు వైద్య సేవలు అందించేందుకు వీలు కలుగుతుంది.

Also Read : పంపిణీ సరే… టీకాలు ఏవీ మోడీజీ..?

ఆస్పత్రుల్లో ప్రమాణాలు.. ఫీజులకు కళ్లెం..!

విరివిగా పరీక్షలు (ఫోకస్డ్‌ టెస్టింగ్‌) చేయడం, కోవిడ్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడం, కోవిడ్‌ ఆస్పత్రుల్లో సీసీ టీవీలు, హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటుతో పాటు శానిటేషన్, నాణ్యమైన ఆహారం, వైద్యులు, మందులు, ఆక్సిజన్‌ సరఫరాను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం ఇప్పటికే అధికారులను నిర్దేశించారు. అదనంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుతో పాటు కోవిడ్‌ ఆసుపత్రుల్లో క్షణం కూడా కరెంట్‌ పోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. సీటీ స్కాన్‌కు రూ.3 వేలకు మించి వసూలు చేయరాదని, ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌కు రూ.499కి మించి వసూలు చేయరాదని ఆదేశించి ఫీజుల ధరలకు కళ్లెం వేసింది. అంతకు మించి వసూలు చేస్తే ఆ డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌ల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామని హెచ్చరించింది.

శరవేగంగా వైద్యుల నియామకం…!

కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 1,170 మంది స్పెషలిస్ట్‌ డాక్టర్లతో పాటు మరో 1,170 మంది జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు. 2 వేల మంది స్టాఫ్‌నర్సులు, 306 మంది అనస్థీషియా టెక్నీషియన్లు, 330 మంది ఎఫ్‌ఎన్‌వోలు, 300 మంది ఎంఎన్‌వోలు, 300 మంది స్వీపర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Also Read : జగన్ మాట నిజమైన వేళ.. ఏపీలో కరోనా వ్యాప్తికి బాధ్యులు ఎవరు..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి