iDreamPost

పేదింటి బిడ్డ కలను సాకారం చేసిన సీఎం జగన్!

పేదింటి బిడ్డ కలను సాకారం చేసిన సీఎం జగన్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విద్యార్థలు కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా పేద విద్యార్థలు చదువుకునేందుకు ఇబ్బందులు పడకూడదని అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అలానే పేద విద్యార్థుల విషయంలో సీఎం జగన్ అనేక సార్లు ఉదారత చాటుకున్నారు. సాయం కోరి వచ్చిన ఎందరో పేద విద్యార్థులకునేనున్నాంటూ భరోసా ఇస్తూ ఆర్థిక సాయం చేశారు. తాజాగా మరోసారి సీఎం జగన్ ఉదారతను చాటుకున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థి కలను సాకారం చేసుకునేందుకు ఆర్థిక భరోసా కల్పించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి  దంగేటి.. ఏవియేషన్ కోర్సు చేయాలని అనుకుంది. ఈ క్రమంలో ఏవియేషన్ శిక్షణ కోసం గతంలో ఏపీ ప్రభుత్వంను ఆర్థిక సాయం కోరాగా.. రూ.50 లక్షలు అందజేసింది. గతేడాది జూలైలో రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా  జాహ్నవి సీఎం జగన్ ని కలిసి.. తన సమస్యను చెప్పుకుంది. ఆ సందర్భంలోనే సీఎం జగన్.. జాహ్నవికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించారు. తాజాగా  ఉభయ గోదావరి జిల్లాలో  సీఎం జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రాజమహేంద్రవరంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లాకు  సీఎం బయలు దేరుతున్నారు. అదే సమంయలో జాహ్నవి.. సీఎం జగన్ ని మరోసారి కలిశారు. ఫైలెట్ ఆస్ట్రోనాట్  అవ్వాలన్న తన కోరికను అర్ధం చేసుకొని ఉన్నత చదువుకు సాయం చేసిన సీఎం జగన్ కు జాహ్నవి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలానే అమెరికాలోని ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం చేయాలని మరోసారి జాహ్నవి విజ్ఞప్తి చేసింది. దీంతో ఆమె విన్నపానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.

ఈ  సందర్భంగా గతంలో ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన జాహ్నవి ఐఐఏఎస్ ఫ్లోరిడా,  యూఎస్ఏ నుంటి సైంటిస్ట్ గా వ్యోమగామి అభ్యర్థికగా సిల్వర్ వింగ్స్  అందుకున్నారని మంత్రి వేణుగోపాల్ .. సీఎం జగన్ కు వివరించారు. ఇప్పటికే  నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ కార్యక్రమంలో పాల్గొని చరిత్ర సృష్టించిన తొలి భారతీయురాలిగా జాహ్నవి గుర్తింపు తెచ్చుకుందని మంత్రి తెలిపారు. మరి.. పేద విద్యార్థుల విద్యా, ఆరోగ్యం విషయంలో సీఎం జగన్ చూపుతున్న ఉదారతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఎస్‌ఐని అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి