iDreamPost

బాబు వెన్ను పోటు వీరుడు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు!

బాబు వెన్ను పోటు వీరుడు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనతో తనదైన రీతిలో దూసుకెళ్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరతరం కృషి చేస్తున్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని జోడెద్దులా పరుగులు పెట్టిస్తున్నారు. పేద వర్గాల ప్రజలు, పాడి రైతుల విషయంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కకటి నిరవేరుస్తున్నారు. తాజాగా పాలవెలువలో కార్యక్రమంలో భాగంగా చిత్తూరు డెయిరీనీ పునరుద్దరించారు. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్‌.. మంగళవారం భూమిపూజ చేశారు. హెరిటేజ్‌ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని సీఎం జగన్‌ మండిపడ్డారు.

మంగళవారం చిత్తూరులో సీఎం జగన్ పర్యటించారు. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేశారు.  అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకపడ్డారు. ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం అన్నారు.మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు.

బహిరంగ సభలో  సీఎం జగన్ మాట్లాడుతూ..‘‘చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైంది. ‘ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారు. మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు. చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే అదే సమయంలో హెరిటేజ్‌ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది.10 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్‌ చేసే స్థాయిలో డెయిరీ ఉంటుంది. ఈ డెయిరీ ద్వారా చిత్తూరుతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులకు మేలు జరుగుతుంది. అదే విధంగా వెల్లూరు మెడికల్‌ కాలేజ్‌ రాకుండా చంద్రబాబు, రామోజీ అడ్డుకున్నారు. అడ్డంకులను దాటి  వెల్లూరు మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి పునాది రాయి వేస్తున్నాం. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు చేసిన మేలు ఒక్కటి కూడా లేదు’’ అని సీఎం జగన్‌ ఆగ్రహం  వ్యక్తం చేశారు.

“చంద్రబాబు హాయంలో 54 ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలను అమ్మేశారు. తన వారికి తక్కువ ధరకు సంస్థలను కట్టబెట్టేశారు. చంద్రబాబు మంచిని నమ్ముకోకుండా మోసాన్నే నమ్ముకున్నారు. అదే విధంగా తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయి. వారు విష ప్రచారాన్ని నమ్మకండి. చంద్రబాబు.. దత్తపుత్రుడితో కలిసి అభివృద్థి, సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటు వీరుడు” అంటూ సీఎం జగన్  మండి పడ్డారు. మరి.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి